• waytochurch.com logo
Song # 3364

yaesu dhivya rakshkuni sthuthimchu bhoomee dhivya praemanu chaatumuయేసు దివ్య రక్షకుని స్తుతించు భూమీ దివ్య ప్రేమను చాటుము



Reference: నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తన Psalm 103:1

1. యేసు దివ్య రక్షకుని స్తుతించు - భూమీ - దివ్య ప్రేమను చాటుము
ముఖ్యదూతలారా శుభ మహిమను - బలఘనముల నర్పించుడి
మోయురీతి యేసు కాపాడు మిమ్మున్ - చేతులందు మోయుచుండును
సీయోను వాసులగు భక్తులారా - సంతోష గీతములు పాడుడి

2. యేసు దివ్యరక్షకుని స్తుతించు - పాపమునకై మరణించెను
బండ నిత్యరక్షణ నిరీక్షణుండు - సిల్వ వేయబడిన యేసుడు
రక్షకా భరించితి దుఃఖ వార్థిన్ - ముండ్ల మకుట ధారివైతివి
త్యజింపబడి చేయి వీడబడిన - మహిమా ప్రభూ నీకే స్తోత్రము

3. యేసు దివ్య రక్షకుని స్తుతించు - నాక గుమ్మములారా పాడుడి
యేసు నిత్యానిత్యము రాజ్యమేలున్ - గురుద్దేవ రాజు నాయనే
మరణ విజయుడు మాదు రాజు - మృత్యువా నీ ముల్లు యెక్కడ?
యేసు జీవించియున్న జయవీరుండు - నీ గుమ్మముల్ కీర్తించి పాడనీ



Reference: naa praaNamaa, yehoavaanu sannuthiMchumu. naa aMtharMgamunanunna samasthamaa, aayana parishudhDha naamamunu sannuthiMchumu. keerthana Psalm 103:1

1. yaesu dhivya rakShkuni sthuthiMchu - bhoomee - dhivya praemanu chaatumu
mukhyadhoothalaaraa shubha mahimanu - balaghanamula narpiMchudi
moayureethi yaesu kaapaadu mimmun - chaethulMdhu moayuchuMdunu
seeyoanu vaasulagu bhakthulaaraa - sMthoaSh geethamulu paadudi

2. yaesu dhivyarakShkuni sthuthiMchu - paapamunakai maraNiMchenu
bMda nithyarakShNa nireekShNuMdu - silva vaeyabadina yaesudu
rakShkaa bhariMchithi dhuHkha vaarThin - muMdla makuta Dhaarivaithivi
thyajiMpabadi chaeyi veedabadina - mahimaa prabhoo neekae sthoathramu

3. yaesu dhivya rakShkuni sthuthiMchu - naaka gummamulaaraa paadudi
yaesu nithyaanithyamu raajyamaelun - gurudhdhaeva raaju naayanae
maraNa vijayudu maadhu raaju - mruthyuvaa nee mullu yekkada?
yaesu jeeviMchiyunna jayaveeruMdu - nee gummamul keerthiMchi paadanee



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com