• waytochurch.com logo
Song # 3369

yaesu prabhu nee mukha dharshanamuchae naa prathi yaashanu theerchukomdhunuయేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి యాశను తీర్చుకొందును



Reference: జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు. యోహాను John 6:35

పల్లవి: యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే
నా ప్రతి యాశను తీర్చుకొందును

1. నీవే నాకు జీవాహారము
నిన్ను సమీపించు వారే మాత్రము
ఆకలి గొనరిల ఆదర్శుడవు

2. నీ మందిర సమృద్ధి వలన
నా మది నెప్పుడు తృప్తి పొందితిని
ఆనంద జలమును త్రాగించుచున్నావు

3. నీవే నాకు జీవపు మార్గము
నీ సన్నిధిని పూర్ణానందము
కలదని నిన్ను ఘనపరచెదను

4. ఆశతో నిండిన నా ప్రాణమును
ఆకలి గొనిన నాదు ఆత్మను
మేలుతో నీవు తృప్తిపరచితివి

5. నీ సంతోషము నాకొసగితివి
నా సంతోషము పరిపూర్ణముగా
కావలయునని కోరిన ప్రభువా

6. నా జీవిత కాలమంతయును
నీ ఆలయములో నివసించుచు
హల్లెలూయ పాటను పాడెద ప్రభువా



Reference: jeevaahaaramu naenae; naayodhdhaku vachchuvaadu aemaathramunu aakaligonadu. naayMdhu vishvaasamuMchu vaadu eppudunu dhappigonadu. yoahaanu John 6:35

Chorus: yaesu prabhu nee mukha dharshanamuchae
naa prathi yaashanu theerchukoMdhunu

1. neevae naaku jeevaahaaramu
ninnu sameepiMchu vaarae maathramu
aakali gonarila aadharshudavu

2. nee mMdhira samrudhDhi valan
naa madhi neppudu thrupthi poMdhithini
aanMdha jalamunu thraagiMchuchunnaavu

3. neevae naaku jeevapu maargamu
nee sanniDhini poorNaanMdhamu
kaladhani ninnu ghanaparachedhanu

4. aashathoa niMdina naa praaNamunu
aakali gonina naadhu aathmanu
maeluthoa neevu thrupthiparachithivi

5. nee sMthoaShmu naakosagithivi
naa sMthoaShmu paripoorNamugaa
kaavalayunani koarina prabhuvaa

6. naa jeevitha kaalamMthayunu
nee aalayamuloa nivasiMchuchu
hallelooya paatanu paadedha prabhuvaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com