jayamani paadu jayamani paadu prabhuyaesunakaeజయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే
Reference: పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో... ఎఫెసీయులకు Ephesians 1:18పల్లవి: జయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే1. ఆది అంతము అల్ఫ ఓమేగా ఆయనే ప్రభువుఆయన యేగా రానున్నవాడు శక్తిమంతుడు2. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెనుప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగ తీర్చె3. యేసులో మమ్ము రక్తముద్వారా విమోచించితివియెంతో కృపతో మమ్మును కడిగి మన్నించి నావుగా4. యేసులో మాకు యేశిక్షలేదు భయము బాపెగావాసిగా మరణబలము తొలగించి పాపము బాపెగా5. క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెనుకరుణించి మమ్ము అంగీకరించె ఎంతో అద్భుతము6. మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మ ముద్ర నిచ్చెనుమనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణ నచ్చె7. ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమిపరిశుద్ధులలో మహిమైశ్వరంబు యెంతో గొప్పది
Reference: parishudhDhulaloa aayana svaasThyamuyokka mahimaishvaryamettidhoa... epheseeyulaku Ephesians 1:18Chorus: jayamani paadu jayamani paadu prabhuyaesunakae mahaadhaevuMdu vishvaviDhaatha rakShkudaayanae1. aadhi aMthamu alpha oamaegaa aayanae prabhuvuaayana yaegaa raanunnavaadu shakthimMthudu2. prabhu yaesunMdhu mammunu pilachi aerparachukonenupraemathoa mammu pavithra parachi nirdhoaShuluga theerche3. yaesuloa mammu rakthamudhvaaraa vimoachiMchithiviyeMthoa krupathoa mammunu kadigi manniMchi naavugaa4. yaesuloa maaku yaeshikShlaedhu bhayamu baapegaavaasigaa maraNabalamu tholagiMchi paapamu baapegaa5. kreesthuloa mammu noothana parachi thMdrini thelipenukaruNiMchi mammu aMgeekariMche eMthoa adhbhuthamu6. maa svaasThyamunaku sMchakaruvugaa aathma mudhra nichchenumanoanaethramulu veligiMchi maaku goppa nireekShNa nachche7. prabhu kreesthuloa vaadabaarani svaasThyamuga naithimiparishudhDhulaloa mahimaishvarMbu yeMthoa goppadhi