• waytochurch.com logo
Song # 3375

jai jai yaesuraajaa jai jai raajaadhiraajaa neekae jai jaiజై జై యేసురాజా జై జై రాజాధిరాజా నీకే జై జై



Reference: కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమకాండము Exodus 19:5

Reference: అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైయిన ప్రజలునై యున్నారు. 1 పేతురు Peter 2:9

పల్లవి: జై జై యేసురాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై

1. పాపకూపములో బడియున్న - నన్ను జూచి చేయి జాచి
చక్కగ దరికి జేర్చితివి

2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా పరిహరించిన
పావనుడగు నా ప్రభుయేసు

3. నీతి హీనుడనైన నాకు - నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన నీతి రాజా

4. మంటి పురుగునైన నన్ను - మంటి నుండి మింట జేర్చిన
మహాప్రభుండా నీకే జై జై

5. పాపశాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయ
సంపాద్యముగా జేసితివి

6. రాజులైన యాజక గుంపులో - నన్ను గూడ నీ సొత్తైన
పరిశుద్ధ జనములో జేర్చితివి

7. తల్లియైన మరచిన మరచును - నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా

8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది యంతము లేని దేవా
యుగా యుగములకు నీకే జై జై



Reference: kaagaa meeru naa maata shradhDhagaa vini naa nibMDhana nanusariMchi nadichina yedala meeru samasthadhaesha janulaloa naaku svakeeya sMpaadhyamagudhuru. nirgamakaaMdamu Exodus 19:5

Reference: ayithae meeru cheekatiloanuMdi aashcharyakaramaina thana veluguloaniki mimmunu pilichina vaani guNaathishayamulanu prachuramu chaeyu nimiththamu, aerparachabadina vMshamunu, raajulaina yaajaka samoohamunu, parishudhDha janamunu, dhaevuni soththaiyina prajalunai yunnaaru. 1 paethuru Peter 2:9

Chorus: jai jai yaesuraajaa jai jai
raajaaDhiraajaa neekae jai jai

1. paapakoopamuloa badiyunna - nannu joochi chaeyi jaachi
chakkaga dhariki jaerchithivi

2. siluva rakthamuloa nannu kadigi - paapamMthaa parihariMchin
paavanudagu naa prabhuyaesu

3. neethi heenudanaina naaku - neethi rakShNa vasthramulanu
preethithoa nosagina neethi raajaa

4. mMti purugunaina nannu - mMti nuMdi miMta jaerchin
mahaaprabhuMdaa neekae jai jai

5. paapashaapagrasthudanai yuMda - nannu gooda nee svakeey
sMpaadhyamugaa jaesithivi

6. raajulaina yaajaka guMpuloa - nannu gooda nee soththain
parishudhDha janamuloa jaerchithivi

7. thalliyaina marachina marachunu - naenu ninnu maruvananin
nammakamaina naa prabhuvaa

8. aDhika sthoathraarhudavaina - aadhi yMthamu laeni dhaevaa
yugaa yugamulaku neekae jai jai



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com