• waytochurch.com logo
Song # 3384

prabhu goppa kaaryamulu chaesenani manamuthsahimchedhamuప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము



Reference: ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తన Psalm 103:2

పల్లవి: ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా

అను పల్లవి: ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె
పాత్రులముగా సేవింతుము

1. దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము
దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాదెదము

2. సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని
సితార స్వరమండలములతో - మన మార్భాటించెదము

3. మన భారములన్నియు తొలగించె - ఘనకార్యములను జేసె
దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో

4. నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు
బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం

5. ప్రేమా సౌందర్యములు గలవాడు - క్షేమము నిచ్చువాడు
మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము

6. మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి
ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్



Reference: aayana chaesina upakaaramulaloa dhaenini maruvakumu. keerthana Psalm 103:2

Chorus: prabhu goppa kaaryamulu chaesenani manamuthsahiMchedhamu
prabhu goppa maelula varShmu manapai kuripiMche nahaa

Chorus-2: aahaa sthoathramu sthoathramulu - iMthavaraku kaache
paathrulamugaa saeviMthumu

1. dhaiva kaaryamulu janamula maDhya - prasidhDhi chaeyudhamu
dhaevuni aashcharya kaaryamu manaloa - DhyaaniMchi paadhedhamu

2. sMgeetha gaanamulathoanu - sannuthiMchuchu prabhuni
sithaara svaramMdalamulathoa - mana maarbhaatiMchedhamu

3. mana bhaaramulanniyu tholagiMche - ghanakaaryamulanu jaese
dhinamella paaduchu ghanaparachedhamu - chaatiMchedha milaloa

4. noothana kaaryamulu chaeyuvaadu - prabhu vaashcharyakarudu
balamagu kaaryamulu chaeyuvaadaayanae Dhairyamugaa paadedhM

5. praemaa sauMdharyamulu galavaadu - kShaemamu nichchuvaadu
mahimaishvaryamulu galavaadaayanae mahini bogadedhamu

6. manakennoa vaagdhaanamu lichche mana manubhaviMchithimi
ghanathaa mahima prabhaavamu prabhunakae hallelooyaa aamen



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com