• waytochurch.com logo
Song # 3390

kruthajnythan thalavmchi naadhu jeevamu arpimthunuకృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును



Reference: క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. జీవించువారిక మీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. 2 కొరింథీయులకు Corinthians 5:14-15

పల్లవి: కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును
లేదే యిక నే యీవి యిల - అర్పింతును నన్నే నీకు

1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్
దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే

2. ఆకర్షంచె లేకాశలన్ని - లోక మహిమ నడ్డగించు
కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును

3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము
నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము

4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును
నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము

5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై



Reference: kreesthu praema mammunu balavMthamu chaeyuchunnadhi. jeeviMchuvaarika meedhata thamakoraku kaaka, thama nimiththamu mruthipoMdhi thirigi laechinavaani korakae jeeviMchutaku aayana aMdharikoraku mruthipoMdhenaniyu nishchayiMchukonuchunnaamu. 2 koriMTheeyulaku Corinthians 5:14-15

Chorus: kruthajnYthan thalavMchi - naadhu jeevamu arpiMthunu
laedhae yika nae yeevi yila - arpiMthunu nannae neeku

1. dhooramaithi nee praema marachi - nae raepithi nee gaayamul
dhooramuga nika veLLajaala - koorchuMdedha nee cheMthanae

2. aakarShMche laekaashalanni - loaka mahima naddagiMchu
koarkelanni kreesthu praemakai - nikkamugaa thyajiMthunu

3. tharamula nee praema naakai - varNiMpanu ashakyamu
nirMtharamu saeviMchinanu - theerchalaenu nee ruNamu

4. loakamukai jeeviMchaniMka - nee korakai jeeviMthunu
nee karpiMpan nae venudheeyan - ee kodhdhi naa jeevithamu

5. chiMthiMchithi gatha paapamulakai - eMthoa naenu yaedchuchuMti
kruthajnYthathoa samarpiMthunu - brathukMthayu nee saevakai


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com