దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు
dhaevaa smvathsaramunu dhayaakireetamugaa nichchi yunnaavu
Reference: సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కీర్తన Psalm 65:11
Reference: ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను. మత్తయి Matthew 28:20
పల్లవి: దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు
దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నవి
1. నీ మీద నా దృష్టి నిలిపి - నీకాలోచన నే చెప్పెదను
అనిన మహోన్నతుడా
2. సతతము మీతో కూడా నేను - ఉన్నాననిన మా ప్రభు యేసు
అభయంబొసగిన మా
3. తలవెండ్రుకలు నెరయు వరకు - నేనే నిన్ను ఎత్తుకొనుచును
రక్షించెద ననిన
4. నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను ప్రేమించితిని
అనిన ప్రేమామయుడ
5. మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల చెంతకు మమ్ము
నిడిపించెద ననిన
6. పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి ప్రాణము నిచ్చి
రక్షించిన మాదు
7. మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామమున పాడెద మెపుడు
హల్లెలూయా ఆమెన్
Reference: sMvathsaramunu nee dhayaakireetamu DhariMpajaesiyunnaavu. nee jaadalu saaramu vedhajalluchunnavi. keerthana Psalm 65:11
Reference: idhigoa naenu yugasamaapthi varaku sadhaakaalamu meethoa kooda unnaanu. maththayi Matthew 28:20
Chorus: dhaevaa sMvathsaramunu dhayaakireetamugaa nichchi yunnaavu
dhaevaa needhu jaadalu saaramunu vedhajalluchunnavi
1. nee meedha naa dhruShti nilipi - neekaaloachana nae cheppedhanu
anina mahoannathudaa
2. sathathamu meethoa koodaa naenu - unnaananina maa prabhu yaesu
abhayMbosagina maa
3. thalaveMdrukalu nerayu varaku - naenae ninnu eththukonuchunu
rakShiMchedha nanin
4. neevae naadhu soththani pilachi - shaashvathamuga ninu praemiMchithini
anina praemaamayud
5. maa kaaparivai maadhu prabhudavai - jeevajalamula cheMthaku mammu
nidipiMchedha nanin
6. paluviDhamulagu baaDhalu poMdhi - rakthamu kaarchi praaNamu nichchi
rakShiMchina maadhu
7. maa prabhuyaesu mahimayu needhae - nee naamamuna paadedha mepudu
hallelooyaa aamen