• waytochurch.com logo
Song # 3397

prabhuvaa paadedha noka sthuthi geethm praemimchi rakshimchithiviప్రభువా పాడెద నొక స్తుతి గీతం ప్రేమించి రక్షించితివి



Reference: అందుకాయన లేచి గాలిని గద్దించి ― నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. మార్కు Mark 4:39

Reference: వెంటనే యేసు ― ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పెను. మత్తయి Matthew 14:27

Reference: ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. కీర్తన Psalm 107:29

పల్లవి: ప్రభువా పాడెద నొక స్తుతి గీతం - ప్రేమించి రక్షించితివి

1. గత వత్సరంబులోన - కాపాడి నడిపినావు
నూతన వత్సరమున - స్తుతియింప చేసినావు

2. యేసయ్య పలికితివి - ఆ సముద్ర పొంగులలో
నిశ్శబ్దముగా యూర - కొండుము నిమ్మళముగా

3. భయపడిన శిష్యులతో - రయమున పలికితివి
భయపడకుడి నేనే - ధైర్యము తెచ్చుకొనుడి

4. తుఫాను రేగె త్వరలో - తరంగములు లేచె
ఆపితివయ్యా దేవా - ఆపద బాపితివి

5. ముండ్లకు బదులు గొంజి - దేవదారులు మొలచు
ఉండును సూచనలుగా - నిత్యంపు ఖ్యతిగాను

6. అభివృద్ధి జేసెదవు - ప్రభువైన యేసు దేవా
అధికంబు మేలులతో - మునుపటి కంటె మరల

7. సిలువలో మా తుఫాను - బలిలో భరించితివి
హల్లెలూయ పాడెదను - కలువరి యేసు నాథా



Reference: aMdhukaayana laechi gaalini gadhdhiMchi ― nishshabdhamai oorakuMdumani samudhramuthoa cheppagaa, gaali aNagi mikkili nimmaLamaayenu. maarku Mark 4:39

Reference: veMtanae yaesu ― Dhairyamu thechchukonudi; naenae, bhayapadakudani vaarithoa cheppenu. maththayi Matthew 14:27

Reference: aayana thuphaanunu aapivaeyagaa dhaani tharMgamulu aNagipoayenu. keerthana Psalm 107:29

Chorus: prabhuvaa paadedha noka sthuthi geethM - praemiMchi rakShiMchithivi

1. gatha vathsarMbuloana - kaapaadi nadipinaavu
noothana vathsaramuna - sthuthiyiMpa chaesinaavu

2. yaesayya palikithivi - aa samudhra poMgulaloa
nishshabdhamugaa yoora - koMdumu nimmaLamugaa

3. bhayapadina shiShyulathoa - rayamuna palikithivi
bhayapadakudi naenae - Dhairyamu thechchukonudi

4. thuphaanu raege thvaraloa - tharMgamulu laeche
aapithivayyaa dhaevaa - aapadha baapithivi

5. muMdlaku badhulu goMji - dhaevadhaarulu molachu
uMdunu soochanalugaa - nithyMpu khyathigaanu

6. abhivrudhDhi jaesedhavu - prabhuvaina yaesu dhaevaa
aDhikMbu maelulathoa - munupati kMte maral

7. siluvaloa maa thuphaanu - baliloa bhariMchithivi
hallelooya paadedhanu - kaluvari yaesu naaThaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com