• waytochurch.com logo
Song # 3405

dhoothapaata paadudi rakshkun sthuthimchudiదూతపాట పాడుడి రక్షకున్ స్తుతించుడి



Reference: వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి ... దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకా 2:13

1. దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్
భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను
ఆకశంబునందున - మ్రోగు పాట చాటుడి
దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి

2. ఊర్థ్వలోకమందున - గొల్వగాను శుద్ధులు
అంత్యకాలమందున - కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా
దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి

3. రావె నీతి సూర్యుడా - రావె దేవపుత్రుడా
నీదు రాకవల్లను - లోక సౌఖ్యమాయెను
భూనివాసులు అందరు - మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి నాత్మశుద్ధి కల్గును
దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి


Reference: veMtanae paraloaka sainya samoohamu aa dhoothathoa kooda nuMdi ... dhaevuni sthoathramu chaeyuchuMdenu. lookaa 2:13

1. dhoothapaata paadudi - rakShkun sthuthiMchudi
aa prabhuMdu puttenu - bethlehaemu nMdhunan
bhoojanMbu kellanu - saukhya sMbhramaayenu
aakashMbunMdhuna - mroagu paata chaatudi
dhoothapaata paadudi - rakShkun sthuthiMchudi

2. oorThvaloakamMdhuna - golvagaanu shudhDhulu
aMthyakaalamMdhuna - kanyagarbhamMdhun
buttinatti rakShkaa - oa immaanuyael prabhoa
oa naraavathaarudaa - ninnu nenna shakyamaa
dhoothapaata paadudi - rakShkun sthuthiMchudi

3. raave neethi sooryudaa - raave dhaevaputhrudaa
needhu raakavallanu - loaka saukhyamaayenu
bhoonivaasulu aMdharu - mruthyubheethi gelthuru
ninnu nammuvaariki naathmashudhDhi kalgunu
dhoothapaata paadudi - rakShkun sthuthiMchudi


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com