• waytochurch.com logo
Song # 3407

vimtimayyaa nee svaramu kmtimayyaa nee roopamunuవింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును



Reference: ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. 1 తిమోతికి Timothy 3:16

పల్లవి: వింటిమయ్యా నీ స్వరము - కంటిమయ్యా నీ రూపమును
ప్రియప్రభూ నిన్నుగాక వేరెవరిని చూడము వినము

1. భక్తి మర్మము గొప్పది యెంతో
శరీరుడుగా మారిన దేవా, దూతలకు కనబడితివి
లోకమందు నమ్మబడియున్న దేవా

2. భయపడవలదని దూతలు తెల్పె
మహా సంతోషకరమైన వార్త, రక్షకుడు పుట్టెనని
పరమందు మహిమ భువికి శాంతియనిరి

3. నరరూప ధారివి యైతివి ప్రభువా
అద్భుతములు చేసియున్నవు, వేరెవ్వరు చేయలేరు
అద్భుతకరుడ ఘనత కలుగును గాక

4. మూగవారికి మాటలిచ్చితివి
గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి, మృతులను లేపితివి
పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా

5. ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి
అధికారముతో తిరిగి లేచితివి, మరణపు ముల్లు విరచితివి
నమాధి నిన్ను గెలువక పోయెను

6. ఇహము నుండి పరమున కేగి
మా కొరకై నీవు రానై యున్నావు, ఆనందముతో కనిపెట్టెదము
మదియందె నిరీక్షణ కలిగి స్తుతింతుం



Reference: aayana sashareerudugaa prathyakShudayyenu. 1 thimoathiki Timothy 3:16

Chorus: viMtimayyaa nee svaramu - kMtimayyaa nee roopamunu
priyaprabhoo ninnugaaka vaerevarini choodamu vinamu

1. bhakthi marmamu goppadhi yeMthoa
shareerudugaa maarina dhaevaa, dhoothalaku kanabadithivi
loakamMdhu nammabadiyunna dhaevaa

2. bhayapadavaladhani dhoothalu thelpe
mahaa sMthoaShkaramaina vaartha, rakShkudu puttenani
paramMdhu mahima bhuviki shaaMthiyaniri

3. nararoopa Dhaarivi yaithivi prabhuvaa
adhbhuthamulu chaesiyunnavu, vaerevvaru chaeyalaeru
adhbhuthakaruda ghanatha kalugunu gaak

4. moogavaariki maatalichchithivi
gruddi kuMtini baagu jaesithivi, mruthulanu laepithivi
paraakrama shaalivi neevae oa prabhuvaa

5. praemiMchi prabhuvaa praaNamichchithivi
aDhikaaramuthoa thirigi laechithivi, maraNapu mullu virachithivi
namaaDhi ninnu geluvaka poayenu

6. ihamu nuMdi paramuna kaegi
maa korakai neevu raanai yunnaavu, aanMdhamuthoa kanipettedhamu
madhiyMdhe nireekShNa kaligi sthuthiMthuM



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com