siluvaloa baliyaina dhaevuni gorrepillసిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల
Reference: మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను. మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. యెషయా Isaiah 53:5పల్లవి: సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటికాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడినా దోషముల నీవు - ప్రియముగను మోసితివా3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేతసురూపము లేక - సోలిపోతివా ప్రియుడా4. నా రోగముల నీపై నమ్రతతో భరియించితృణీకరింపబడి - ప్రాణమర్పించితివి5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించిమౌనము ధరించి - మరణమైతివా ప్రభువా6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనేమరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకైపదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ
Reference: mana yathikramakriyalanubatti athadu gaayaparacha badenu. mana dhoaShmulanubatti nalugagottabadenu. mana samaaDhaanaarThamaina shikSh athanimeedha padenu. yeShyaa Isaiah 53:5Chorus: siluvaloa baliyaina dhaevuni gorrepill viluvaina nee praeman vivariMthu shreeyaesu1. aanaati yoodhulae ninnu jMpiranukoMtikaadhu kaadhayyayyoa - naa paapa ruNamunakae2. naa yathikramamulakai - nalugagottabadinaa dhoaShmula neevu - priyamuganu moasithivaa3. mrudhuvaina nee nudhuru - muMdla poatlachaethsuroopamu laeka - soalipoathivaa priyudaa4. naa roagamula neepai namrathathoa bhariyiMchithruNeekariMpabadi - praaNamarpiMchithivi5. vyasanaakraaMthudavugaa - vyaaDhi nanubhaviMchimaunamu DhariMchi - maraNamaithivaa prabhuvaa6. naa paapa dhoaShmuchae - nae chachchi yuMdaganaemaraNamai naakoraku - mari thirigi laechithivaa7. paramuna keththabadina - priya yaesuraakadakaipadhilamuga kanipetti - paadedhanu hallelooy