aanandam yesutho ఆనందం యేసుతో ఆనందం
ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో పాడెదను జయరాజాధిరాజుతో సాగెదను1. నా ప్రాణమునకు సేదదీర్చి తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను ఏ అపాయమునకు నేను భయపడకుందును ॥ ఆనందం ॥ 2. నా ప్రభుని కృప చూచిన నాటినుండి నన్ను నేనే మరచిపోతినే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా ॥ ఆనందం ॥ 3. సిలువను యేసు సహించెను తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై అవమానము నొందె - నాకై మరణము గెలిచె ॥ ఆనందం ॥