sarvonathuda neeve naaku సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2 ఎవ్వరులేరు - నాకు ఇలలో -2 ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2 1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2 వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥ 2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2 సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥ 3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2 విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥