kaalamu sameepamu prabhu yaesu vachchun jeethamu pomdhunu nija dhaasuduకాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ జీతము పొందును నిజ దాసుడు
Reference: పునాది మీద ఒకడు కట్టినపని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును 1 కొరింథీ Corinthians 3:14పల్లవి: కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ జీతము పొందును నిజ దాసుడు ఆనందమొందెదరు ఆనందమొందెదరు1. బయలుపడు ప్రతివాని క్రియలు - కర్రగడ్డి కొయ్యకాలైననువెండి బంగారము విలువ రాళ్ళైననుఅగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు2. పందెమందు నీకు పాలున్నదా - పొందువాడొక్కడే బహుమతినియ్యోధుడవై మంచి బుద్ధిని కలిగినవాడబారని - (2) కిరీట మొందెదవు3. ఆత్మలకొరకై భారమున్నదా - ఫలితమున్నదా నీ సేవలోప్రభుని రాకలో అందరి యెదుటఆనందమహిమ - (2) కిరీట మొందెదవు4. సంఘము నడిపే సేవకుడా - మందను నడుపుము ప్రేమతోడఆదర్శుండవై మందను కాచినమహిమ కిరీటము - (2) నీవు పొందెదవు5. మంచి పోరాటము పోరాడుము - కాపాడుకొను విశ్వాసమునుతన ప్రత్యక్షత నపేక్షించుమునీతి కిరీటము - (2) నీ కివ్వబడును6. భక్తితో బ్రతుక గోరినచో - సిద్ధపడు పొంద హింసలనుఅంతము వరకు నమ్మికయుంచినజీవకిరీటము - (2) పొందెద వెరుచు7. దయచేయు శ్రేష్ట దీవెనలు - అంగీకరించు నీ ప్రార్థనలుప్రార్థన యందు మేల్కొని యుండుముస్వర్ణకిరీటము - (2) ధరింపజేయును