• waytochurch.com logo
Song # 3453

prakaasha vasthramuthoa paraloaka mahimathoa loakmbuna kaethemchunu maeghmbupai prabhuvaeప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకంబున కేతెంచును మేఘంబుపై ప్రభువే



Reference: మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు మత్తయి Matthew 24:30

పల్లవి: ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో
లోకంబున కేతెంచును మేఘంబుపై ప్రభువే

1. అంత్య సూచనలు చూడుము - ప్రభు రాకకు మునుపు
క్రీస్తు నిశ్చయముగా వచ్చును - బూర శబ్దముతో
విస్తరించు లోకమందు - యుద్ధము కరవులు
విస్తరించు పాపములు దుహ్ఖము కలవరము

2. పాపముచే జన్మించిరి - తల్లి గర్భమునుండి
కోపము దుష్టమోసము - ఎల్లరి హృదయములు
పాప దృష్టి జారచోర - దేవదూషణ హత్యలు
వేపుగా దుష్టగర్వముల్ - హృదయ రోగములు

3. వెళ్ళరు పరలోకమునకు - ఎవ్వరు పాపముతో
చాలవు నీతి క్రియలు - ప్రార్థనలు రక్షింపవు
చాలును యేసు రక్షింప - ప్రాణమర్పించెను
కలుషములు కడుగును - తన రక్తము చిందించె

4. క్షణములోనే గతించును - జీవిత మేపాటిది
తన యాస్తి విడచి నరుడు - నరకము పాలగున్
నిన్ను రక్షింప నీ ప్రభు - సిద్ధముగ నిలిచె
పెన్నుగ పొందుము రక్షణ - నమ్మి యేసు ప్రభువులో



Reference: manuShyakumaarudu prabhaavamuthoanu mahaa mahimathoanu aakaasha maeghaarooDudai vachchuta choochedharu maththayi Matthew 24:30

Chorus: prakaasha vasthramuthoa paraloaka mahimathoa
loakMbuna kaetheMchunu maeghMbupai prabhuvae

1. aMthya soochanalu choodumu - prabhu raakaku munupu
kreesthu nishchayamugaa vachchunu - boora shabdhamuthoa
visthariMchu loakamMdhu - yudhDhamu karavulu
visthariMchu paapamulu dhuhkhamu kalavaramu

2. paapamuchae janmiMchiri - thalli garbhamunuMdi
koapamu dhuShtamoasamu - ellari hrudhayamulu
paapa dhruShti jaarachoara - dhaevadhooShNa hathyalu
vaepugaa dhuShtagarvamul - hrudhaya roagamulu

3. veLLaru paraloakamunaku - evvaru paapamuthoa
chaalavu neethi kriyalu - praarThanalu rakShiMpavu
chaalunu yaesu rakShiMpa - praaNamarpiMchenu
kaluShmulu kadugunu - thana rakthamu chiMdhiMche

4. kShNamuloanae gathiMchunu - jeevitha maepaatidhi
thana yaasthi vidachi narudu - narakamu paalagun
ninnu rakShiMpa nee prabhu - sidhDhamuga niliche
pennuga poMdhumu rakShNa - nammi yaesu prabhuvuloa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com