• waytochurch.com logo
Song # 3495

rakshna nosagedu yaesuni praemanu lakshyamu chaeyumu oa priyudaaరక్షణ నొసగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ఓ ప్రియుడా



Reference: ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి యెషయా Isaiah 55:6

పల్లవి: రక్షణ నొసగెడు యేసుని ప్రేమను
లక్ష్యము చేయుము ఓ ప్రియుడా
అక్షయ రాజ్యము నీయను వచ్చిన
రక్షకున్ బొగడుము స్నేహితుడా

1. లోకపు ప్రేమను యేమని తెల్పెద
నీ కవమానంబే దలచినచో
మారని యేసుని రక్షకున్ ప్రేమ
తాకుడు నొందుము ఓ ప్రియుడా

2. పాపపు ప్రేమలో విడువక నిలిచిన
తాపము చెందెద వో నరుడా
పాపిని గావను ప్రేమ స్వరూపుడు
శాపము నోర్చెను కల్వరిలో

3. చచ్చిన పాపిని వెదకి రక్షింప
చచ్చి బ్రతికిన ఘనుడెవడు
వచ్చిన పాపిని వద్దని త్రోయని
నిశ్చల ప్రేమామయుడు యేసే

4. నమ్ముము సోదరా నిన్ను రక్షించును
నెమ్మది నొందెదవు నిజము
నమ్మినచో ప్రభుప్రేమను గానవు
నమ్ముము ప్రభు ప్రేమ నీదినమే

5. ఘన ధనికుల మత సౌందర్యంబులన్
గానవు నిజ ప్రేమాదరణల్
ఎన్నిల నున్నను నిలచునే నిత్యము
పెన్నుగ బొందుము ప్రభు ప్రేమన్

6. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తమున్
దండిగ నెరవేర్చు ఘనులు
ఎందరో వేగిరి పొందను మకుటము
పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయ



Reference: aayana sameepamuloa uMdagaa aayananu vaedukonudi yeShyaa Isaiah 55:6

Chorus: rakShNa nosagedu yaesuni praemanu
lakShyamu chaeyumu oa priyudaa
akShya raajyamu neeyanu vachchin
rakShkun bogadumu snaehithudaa

1. loakapu praemanu yaemani thelpedh
nee kavamaanMbae dhalachinachoa
maarani yaesuni rakShkun praem
thaakudu noMdhumu oa priyudaa

2. paapapu praemaloa viduvaka nilichin
thaapamu cheMdhedha voa narudaa
paapini gaavanu praema svaroopudu
shaapamu noarchenu kalvariloa

3. chachchina paapini vedhaki rakShiMp
chachchi brathikina ghanudevadu
vachchina paapini vadhdhani throayani
nishchala praemaamayudu yaesae

4. nammumu soadharaa ninnu rakShiMchunu
nemmadhi noMdhedhavu nijamu
namminachoa prabhupraemanu gaanavu
nammumu prabhu praema needhinamae

5. ghana Dhanikula matha sauMdharyMbulan
gaanavu nija praemaadharaNal
ennila nunnanu nilachunae nithyamu
pennuga boMdhumu prabhu praeman

6. thMdri kumaara shudhDhaathmala chiththamun
dhMdiga neravaerchu ghanulu
eMdharoa vaegiri poMdhanu makutamu
poMdhumu prabhu praema hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com