• waytochurch.com logo
Song # 3507

mana prabhuvaina yaesunmdhu ennoa dheevenaluమన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు



Reference: ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మన కనుగ్రహించెను ఎఫెసీ Ephesians 1:3

పల్లవి: మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు

1. ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడిన
తనయులుగాను స్వీకరించబడి - ధన్యులయ్యెదరు వారే

2. అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడిన
కృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే

3. మనో నేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడి
తన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే

4. నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడ బారనిది
పరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే

5. కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకును
మనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెదరు వారే



Reference: aayana kreesthunMdhu paraloaka viShyamulaloa aathma sMbMDhamaina prathi aasheervaadhamunu mana kanugrahiMchenu ephesee Ephesians 1:3

Chorus: mana prabhuvaina yaesunMdhu - ennoa dheevenalu

1. muMdhugaa nirNayiMchabadi - thanachae aerparachabadin
thanayulugaanu sveekariMchabadi - Dhanyulayyedharu vaarae

2. aparaaDhamulu kShmiMchabadi - prabhu rakthamuchae konabadin
krupadhvaaraa rakShiMpabadedharu - Dhanyulayyedharu vaarae

3. manoa naethramulu veligiMpabadi - ghanamugaa prabhuchae piluvabadi
thana bhakthulathoa svaasThyamu poMdhi - Dhanyulayyedharu vaarae

4. nirmalamu - mari akShyamu - viriviga vaada baaranidhi
paraloakamuloa svaasThyamu kaligi - Dhanyulayyedharu vaarae

5. kannulaku kanipiMchanivi - vinipiMchanivi chevulakunu
manoa goacharamu kaanivi poMdhi - Dhanyulayyedharu vaarae



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com