vyarthm vyarthm sarvamu vyarthm nashimchu loakm naashamu thadhymవ్యర్థం వ్యర్థం సర్వము వ్యర్థం నశించు లోకం నాశము తధ్యం
Reference: వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థమే ప్రసంగి 1:2పల్లవి: వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థం - నశించు లోకం నాశము తధ్యం1. దుష్టలోకములో సర్వము చెడెనుదీని యందంవాడి పోవుచున్నది - పోవుచున్నది2. చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్నిండియున్నదిపుడే పాపపుపాత్ర, పాపపుపాత్ర3. నలుదిశల చూడుమా పాపము కలదుకలహ కలవరములో నిండియున్నది, నిండియున్నది4. లోకంలో నన్ని గతించి పోవునవిలోకం యెంతో అయోగ్యంబైయున్నది, అయోగ్యంబదే5. యిద్ధరలో మనకేమియు లేదుస్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము, ఈర్ష్యమయము6. ఒకనాడీ మహిని ప్రభువు దహించునుసకలంబును నాశనంబుచేయును, నాశనముచేయును7. ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదుసకల శాంతి సంతోషమందు కలదు, అందునగలదు8. ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకుమారు మనసునొంది యేసుని నమ్ము, యేసుని నమ్ము