• waytochurch.com logo
Song # 3515

idhiyae samaymbu rmdi yaesuni jaermdiఇదియే సమయంబు రండి యేసుని జేరండి



Reference: ఇదియే రక్షణ దినము 2 కొరింథీ Corinthians 6:2

పల్లవి: ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి రండీ రక్షణ పొందండి

1. పాపులనందరిని తన దాపున జేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా

2. రాజులకు రాజైన యేసు రానైయున్నాడు
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
తరుణముండగానే - మీరు తయ్యారవ్వండి

3. బుద్ధిలేని కన్యకలవలె మొద్దులు గానుంటే
సిద్దెలలోని నూనెపోసి సిద్ధపడకపోతె
తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి

4. వెలుపట నుంటేనూ మీరు వేదన నొందెదరు
ప్రభువా ప్రభువనుచు - యెలుగెత్తి పిలిచినను
మిమ్మును ఎరుగనూ మీ రెవరో పొమ్మనును

5. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగా
నమ్మనివారికి నిత్య నరకము తప్పదుగా
నిర్లక్ష్యము చేయకును రండి రక్షణ పొందండి

6. సందియపడకండి మీరు సాకులు చెప్పకను
సత్యవాక్యమును మీరు సరిగా చూడండి
మరణ దినమును మన మెరుగము నమ్మండి

7. జాలము చేయకను మీరు హేళనచేయకను
కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను
తరుణముండగానే మీరు త్వరపడి రారండి



Reference: idhiyae rakShNa dhinamu 2 koriMThee Corinthians 6:2

Chorus: idhiyae samayMbu rMdi yaesuni jaerMdi
ika samayamu laedhMdi rMdee rakShNa poMdhMdi

1. paapulanMdharini thana dhaapuna jaerchutakai
praaNamu dhaanamugaa thana praaNamu nichchenugaa
maraNapu mullunu virichi vijayamu nichchenugaa

2. raajulaku raajaina yaesu raanaiyunnaadu
guruthulu jarigenugaa meeru sarigaa choodMdi
tharuNamuMdagaanae - meeru thayyaaravvMdi

3. budhDhilaeni kanyakalavale modhdhulu gaanuMtae
sidhdhelaloani noonepoasi sidhDhapadakapoathe
thalupunu thattinanu meeku theruvadu summMdi

4. velupata nuMtaenoo meeru vaedhana noMdhedharu
prabhuvaa prabhuvanuchu - yelugeththi pilichinanu
mimmunu eruganoo mee revaroa pommanunu

5. nammina vaariki kreesthu nemmadhi nichchunugaa
nammanivaariki nithya narakamu thappadhugaa
nirlakShyamu chaeyakunu rMdi rakShNa poMdhMdi

6. sMdhiyapadakMdi meeru saakulu cheppakanu
sathyavaakyamunu meeru sarigaa choodMdi
maraNa dhinamunu mana merugamu nammMdi

7. jaalamu chaeyakanu meeru haeLanachaeyakanu
kulamu sThalamanuchu meeru kaalamu gadupakanu
tharuNamuMdagaanae meeru thvarapadi raarMdi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com