prabhuvaa nee samukhamandhu ప్రభువా నీ సముఖము నందు
ప్రభువా - నీ సముఖము నందు సంతోషము - కలదుహల్లెలూయా సదా - పాడెదన్ హల్లెలూయా సదా - పాడెదన్ ప్రభువా - నీ సముఖము నందు 1. పాపపు ఊబిలో - నేనుండగా ప్రేమతో - నన్నాకర్షించితిరే -2 కల్వారి రక్తంతో - శుద్ధి చేసి -2 రక్షించి పరిశుద్ధులతో - నిల్పి ॥ ప్రభువా ॥ 2. సముద్ర - తరంగముల వలె శోధనలెన్నో- ఎదురైనను -2 ఆదరణ కర్తచే - ఆదరించి -2 నీ నిత్య కృపలో - భద్రపరచి ॥ ప్రభువా ॥ 3. సౌందర్య సీయోన్ని - తలంచగా ఉప్పొంగుచున్న - హృదయముతో -2 ఆనందమానంద - మానందమాని -2 ప్రియునితో నేను పాడెదను ॥ ప్రభువా ॥