• waytochurch.com logo
Song # 3532

choodumu neevu maelukonumu yaesu vachchuchunnaaduచూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు



Reference: ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు మత్తయి Matthew 25:6

పల్లవి: చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు
అంధకార రాజ్యమున కా రాజు మహిమతో వచ్చును

1. హృదయ ద్వారమును తెరువు యేసు తట్టుచున్నాడు
నేడే నిన్ను పిలుచుచుండె ఆలస్యము చేయకుము

2. నేడే వినుము సువార్తను పొందు గొప్పరక్షణ
రాదు తరుణము లేదు మరల - మరణము నిన్ను కొనిపోవున్

3. విడువుము అంధకార త్రోవ విడువుము నీ చెడు జీవితము
నేడే యేసును విశ్వసించి - నడువ నాయత్తపడుము

4. పాపడాగులనేకములు అపాయ మతి నీచములు
పాపములేని యేసురక్తము - పాపములన్ని కడుగును

5. కల్వరి సిలువపై చూడుమా జీవమైన రక్షకుని
నీవు పొందుము నిత్యజీవము - లేచి పాడుము హల్లెలూయ



Reference: idhigoa peMdli kumaarudu vachchuchunnaadu maththayi Matthew 25:6

Chorus: choodumu neevu maelukonumu yaesu vachchuchunnaadu
aMDhakaara raajyamuna kaa raaju mahimathoa vachchunu

1. hrudhaya dhvaaramunu theruvu yaesu thattuchunnaadu
naedae ninnu piluchuchuMde aalasyamu chaeyakumu

2. naedae vinumu suvaarthanu poMdhu gopparakShN
raadhu tharuNamu laedhu marala - maraNamu ninnu konipoavun

3. viduvumu aMDhakaara throava viduvumu nee chedu jeevithamu
naedae yaesunu vishvasiMchi - naduva naayaththapadumu

4. paapadaagulanaekamulu apaaya mathi neechamulu
paapamulaeni yaesurakthamu - paapamulanni kadugunu

5. kalvari siluvapai choodumaa jeevamaina rakShkuni
neevu poMdhumu nithyajeevamu - laechi paadumu hallelooya



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com