• waytochurch.com logo
Song # 3536

choodumu ee kshnamae kalvarini praemaa prabhuvu neekai niluchumdenuచూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను



Reference: వారు కల్వరి అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు లూకా Luke 23:33

పల్లవి: చూడుము ఈ క్షణమే కల్వరిని
ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను
గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు
సిలువలో వ్రేలాడు చున్నాడుగా

1. మానవు లెంతో చెడిపోయిరి
మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణము నిక్కమని
నరకమున్నదని వారెరుగరు

2. ఇహమందు నీకు కలవన్నియు
చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవు లేచెదవు
తీర్పున్నదని ఎరుగు ఒక దినమున

3. మనలను ధనవంతులుగా చేయను
దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై
అంగీకరించుము శ్రీ యేసుని

4. సిలువపై చూడుము ఆ ప్రియుని
ఆ ప్రేమకై నీవు యేమిత్తువు
అర్పించుకో నీదు జీవితము
ఆయన కొరకై జీవించుము



Reference: vaaru kalvari anabadina sThalamunaku vachchinappudu lookaa Luke 23:33

Chorus: choodumu ee kShNamae kalvarini
praemaa prabhuvu neekai niluchuMdenu
goppa rakShNanivva shree yaesudu
siluvaloa vraelaadu chunnaadugaa

1. maanavu leMthoa chedipoayiri
maraNiMchedhamani thalapoayak
erugaru maraNamu nikkamani
narakamunnadhani vaarerugaru

2. ihamMdhu neeku kalavanniyu
chanipoavu samayaana veMtaraavu
chanipoayinanu neevu laechedhavu
theerpunnadhani erugu oka dhinamun

3. manalanu DhanavMthulugaa chaeyanu
dharidhrudaayenu mana prabhuvu
rakthamu kaarchenu paapulakai
aMgeekariMchumu shree yaesuni

4. siluvapai choodumu aa priyuni
aa praemakai neevu yaemiththuvu
arpiMchukoa needhu jeevithamu
aayana korakai jeeviMchumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com