naenu ghoarapaapini chaeri vaeduchumtini kshmimchumuనేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము
Reference: నేను పాపములో పుట్టినవాడను కీర్తనలు Psalm 51:5పల్లవి: నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము1. ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందినఆది దోషము అంటియుండెనయ్య – దాని నిర్మూలించు యేసయ్య2. నా తల్లి గర్భమందున అవతరించుట తోడనేపాపము తోడనే పుట్టితి నేసయ్యా – దాని పరిహరింపుము3. నా యపరాధము చేతను నే జేసిన పాపమందునసత్యములేక నేజచ్చిన వాడను – ననుజీవింపచేయు యేసయ్యా4. పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటినిఆపద గుర్తించ లేక నే గడిపితిని – దాపు జేరితి ప్రాపునీయుము5. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకనుపచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా – వచ్చి నీ ప్రాపున జేరితి6. లోకానంద యంద మందున వీకతో వీక్షింపనేగితిదావీదువలె బెత్షెబా బారిలో నుంటి – దేవా విమోచించు యేసయ్యా7. ఎన్నెనోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితినావలె మీనాగర్భములో నుంటి – నన్ను నీదరిజేర్చు మేసయ్యా
Reference: naenu paapamuloa puttinavaadanu keerthanalu Psalm 51:5Chorus: naenu ghoarapaapini chaeri vaeduchuMtini kShmiMchumu1. aadhaamu havvalMdhuna aedhaenuloa nae poMdhinaadhi dhoaShmu aMtiyuMdenayya – dhaani nirmooliMchu yaesayy2. naa thalli garbhamMdhuna avathariMchuta thoadanaepaapamu thoadanae puttithi naesayyaa – dhaani parihariMpumu3. naa yaparaaDhamu chaethanu nae jaesina paapamMdhunsathyamulaeka naejachchina vaadanu – nanujeeviMpachaeyu yaesayyaa4. paapamulu dhaachukoMtini shaapamunu goorchukoMtiniaapadha gurthiMcha laeka nae gadipithini – dhaapu jaerithi praapuneeyumu5. arikaalu modhalukoni thala varaku svasThatha laekanupachchipuMdlu gaayamulathoa naesayyaa – vachchi nee praapuna jaerithi6. loakaanMdha yMdha mMdhuna veekathoa veekShiMpanaegithidhaaveedhuvale bethShebaa baariloa nuMti – dhaevaa vimoachiMchu yaesayyaa7. ennenoamaarlu nee sanniDhin naenu vidichi aetheMchithinaavale meenaagarbhamuloa nuMti – nannu needharijaerchu maesayyaa