viduvavu nannika ennadainanu padipoakumdaa kaayurakshkaaవిడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షకా
Reference: యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించి లేవనెత్తువాడు కీర్తనలు 145:14
పల్లవి: విడువవు నన్నిక ఎన్నడైనను
పడిపోకుండా కాయురక్షకా
పడిపోవు వారెల్లరిని
లేపెడి వాడవు నీవే ప్రభూ
1. ప్రభువా నీకవిధేయుడనై
పలుమారులు పడుసమయములో
ప్రేమతో జాలి దీనస్వరముతో
ప్రియుడా నను పైకెత్తితివి
2. ఆదాము హవ్వలు ఏదేనులో
ఆశతో ఆజ్ఞ మీరినను
సిలువకు ఛాయగ బలి నర్పించి
ప్రియముగా విమోచించితివి
3. మోషేకు నీ దర్శనమిచ్చి
నీ ప్రజలను నడిపించుటకై
సాకులు చెప్పిన విడువక తననే
నాయకునిగ నియమించితివి
4. స్వంత తలంపున దావీదు
మందసమును తెచ్చునప్పుడు
ఉజ్జా మరణముచే దావీదు
హృదయమును కదిలించితివి
5. నీమాటలు వినక యోనా
తర్షీషుకు తరలినపుడు
సముద్రములో మునుగుచుండ
చేపద్వారా దరిచేర్చితివి
6. నిన్నెన్నడు యెడబాయనని
నిక్కముగ పేతురు పలికె
ముమ్మారు బొంకినను విడువక
ప్రేమతోను రక్షించితివి
7. మా శక్తియు మా భక్తియు కాదు
ఇలలో జీవించుట ప్రభువా
కొల్లగ నీ యాత్మను నొసగితివి
హల్లెలూయ పాడెదను
Reference: yehoavaa padipoavuvaarinMdharini udhDhariMchi laevaneththuvaadu keerthanalu 145:14
Chorus: viduvavu nannika ennadainanu
padipoakuMdaa kaayurakShkaa
padipoavu vaarellarini
laepedi vaadavu neevae prabhoo
1. prabhuvaa neekaviDhaeyudanai
palumaarulu padusamayamuloa
praemathoa jaali dheenasvaramuthoa
priyudaa nanu paikeththithivi
2. aadhaamu havvalu aedhaenuloa
aashathoa aajnY meerinanu
siluvaku Chaayaga bali narpiMchi
priyamugaa vimoachiMchithivi
3. moaShaeku nee dharshanamichchi
nee prajalanu nadipiMchutakai
saakulu cheppina viduvaka thananae
naayakuniga niyamiMchithivi
4. svMtha thalMpuna dhaaveedhu
mMdhasamunu thechchunappudu
ujjaa maraNamuchae dhaaveedhu
hrudhayamunu kadhiliMchithivi
5. neemaatalu vinaka yoanaa
tharSheeShuku tharalinapudu
samudhramuloa munuguchuMd
chaepadhvaaraa dharichaerchithivi
6. ninnennadu yedabaayanani
nikkamuga paethuru palike
mummaaru boMkinanu viduvak
praemathoanu rakShiMchithivi
7. maa shakthiyu maa bhakthiyu kaadhu
ilaloa jeeviMchuta prabhuvaa
kollaga nee yaathmanu nosagithivi
hallelooya paadedhanu