• waytochurch.com logo
Song # 3559

paapini naenu thappithi bhuviloa rakshimchedi vaarevaruపాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు



Reference: ప్రభువా నన్ను రక్షింపుము మత్తయి Matthew 14:31

పల్లవి: పాపిని నేను తప్పితి – భువిలో రక్షించెడి వారెవరు
ఓ ప్రభు యేసు నిరీక్షణతో – నీ దరికి జేరితిని

1. ప్రభువా పాపిని రక్షించుటకు – ఈ భువి కరుదెంచితివి
దౌర్భాగ్యుడను వేడితి శరణం – వేరేమి చేయలేను

2. జీవము నివ్వ వచ్చితివి – చచ్చి యుంటి నేను
బంధింపబడితిని మరణ బంధముతో – విడిపించెడి వారెవరు

3. జన్మముతోనే అపవిత్రుడను – నా స్వభావమే పాపం
క్రియలలోను మాటలయందు – నీకు విరోధినైతిని

4. స్వంత నీతితో నిండిన పనులు – మరి పుణ్య కార్యములు
ఆచారములతో చిక్కుకొన్నాను – తప్పించెడి వారెవరు

5. భరియించితివి పాపపు శిక్ష – ప్రాణమిచ్చితివి నాకై
రక్తము కార్చి సర్వమిచ్చితివి – నన్ను రక్షించుటకై

6. ఓ ప్రభు యేసు దయాళుడ వీవు – కృంగివచ్చుచున్నాను
నా పాపములు క్షమియించు ప్రభువా – గొప్ప రక్షణకర్త వీవే



Reference: prabhuvaa nannu rakShiMpumu maththayi Matthew 14:31

Chorus: paapini naenu thappithi – bhuviloa rakShiMchedi vaarevaru
oa prabhu yaesu nireekShNathoa – nee dhariki jaerithini

1. prabhuvaa paapini rakShiMchutaku – ee bhuvi karudheMchithivi
dhaurbhaagyudanu vaedithi sharaNM – vaeraemi chaeyalaenu

2. jeevamu nivva vachchithivi – chachchi yuMti naenu
bMDhiMpabadithini maraNa bMDhamuthoa – vidipiMchedi vaarevaru

3. janmamuthoanae apavithrudanu – naa svabhaavamae paapM
kriyalaloanu maatalayMdhu – neeku viroaDhinaithini

4. svMtha neethithoa niMdina panulu – mari puNya kaaryamulu
aachaaramulathoa chikkukonnaanu – thappiMchedi vaarevaru

5. bhariyiMchithivi paapapu shikSh – praaNamichchithivi naakai
rakthamu kaarchi sarvamichchithivi – nannu rakShiMchutakai

6. oa prabhu yaesu dhayaaLuda veevu – kruMgivachchuchunnaanu
naa paapamulu kShmiyiMchu prabhuvaa – goppa rakShNakartha veevae


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com