paapini naenu thappithi bhuviloa rakshimchedi vaarevaruపాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు
Reference: ప్రభువా నన్ను రక్షింపుము మత్తయి Matthew 14:31పల్లవి: పాపిని నేను తప్పితి – భువిలో రక్షించెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో – నీ దరికి జేరితిని1. ప్రభువా పాపిని రక్షించుటకు – ఈ భువి కరుదెంచితివిదౌర్భాగ్యుడను వేడితి శరణం – వేరేమి చేయలేను2. జీవము నివ్వ వచ్చితివి – చచ్చి యుంటి నేనుబంధింపబడితిని మరణ బంధముతో – విడిపించెడి వారెవరు3. జన్మముతోనే అపవిత్రుడను – నా స్వభావమే పాపంక్రియలలోను మాటలయందు – నీకు విరోధినైతిని4. స్వంత నీతితో నిండిన పనులు – మరి పుణ్య కార్యములుఆచారములతో చిక్కుకొన్నాను – తప్పించెడి వారెవరు5. భరియించితివి పాపపు శిక్ష – ప్రాణమిచ్చితివి నాకైరక్తము కార్చి సర్వమిచ్చితివి – నన్ను రక్షించుటకై6. ఓ ప్రభు యేసు దయాళుడ వీవు – కృంగివచ్చుచున్నానునా పాపములు క్షమియించు ప్రభువా – గొప్ప రక్షణకర్త వీవే
Reference: prabhuvaa nannu rakShiMpumu maththayi Matthew 14:31Chorus: paapini naenu thappithi – bhuviloa rakShiMchedi vaarevaru oa prabhu yaesu nireekShNathoa – nee dhariki jaerithini1. prabhuvaa paapini rakShiMchutaku – ee bhuvi karudheMchithividhaurbhaagyudanu vaedithi sharaNM – vaeraemi chaeyalaenu2. jeevamu nivva vachchithivi – chachchi yuMti naenubMDhiMpabadithini maraNa bMDhamuthoa – vidipiMchedi vaarevaru3. janmamuthoanae apavithrudanu – naa svabhaavamae paapMkriyalaloanu maatalayMdhu – neeku viroaDhinaithini4. svMtha neethithoa niMdina panulu – mari puNya kaaryamuluaachaaramulathoa chikkukonnaanu – thappiMchedi vaarevaru5. bhariyiMchithivi paapapu shikSh – praaNamichchithivi naakairakthamu kaarchi sarvamichchithivi – nannu rakShiMchutakai6. oa prabhu yaesu dhayaaLuda veevu – kruMgivachchuchunnaanunaa paapamulu kShmiyiMchu prabhuvaa – goppa rakShNakartha veevae