aascharyakarudaa needhu krupa ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినం అనుభవించెద
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది 1. ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే -2 జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥ 2. ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే -2 పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥ 3. యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2 నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో -2 ॥ ఆశ్చర్య ॥