smthasillunu mee hrudhayaalu seeyoanu mahimajoochiసంతసిల్లును మీ హృదయాలు సీయోను మహిమజూచి
Reference: ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను అపొస్తలుల కార్యములు Acts 8:8పల్లవి: సంతసిల్లును మీ హృదయాలు సీయోను మహిమజూచి (2)1. సుందర వరుడు యేసు ప్రభువు - సుందరవతి సీయోనుశాశ్వత శోభాతిశయముతో - భాసిల్లుటను జూచి2. నీలమయ నిత్య పునాదులు - మేలిమి ఛాయామణులుసూర్యకాంత సుగంధములు - పుష్యరాగ నిర్మితము3. నిత్య మహిమతో వెలిగెడు - ముత్యాల గుమ్మములుస్వచ్ఛమగు సువర్ణమయము - ఆశ్చర్య నగరము4. జీవవృక్షము జీవఫలములు - జీవామృతపానముకాంతి వంతముగా మెరిసేటి - వింతలుగొల్పు నగరము5. స్వర్ణ సమము దాని ప్రజలు సంతోష సహితులుదూతలే వింతపడునట్లు ఖ్యాతిని కలిగిన వారు6. మందిర సమృద్ధిని వారు - తృప్తి నొందుచున్నారుఆనంద ప్రవాహమునందు - పానము చేయుచున్నారు7. దేవుడు సెలవిచ్చినయట్టి - దేవో క్తులలో నేదిజరుగకుండగ పోలేదు - వరుసగా నెరవేరెన్
Reference: aa pattaNamuloa migula sMthoaShmu kaligenu aposthalula kaaryamulu Acts 8:8Chorus: sMthasillunu mee hrudhayaalu seeyoanu mahimajoochi (2)1. suMdhara varudu yaesu prabhuvu - suMdharavathi seeyoanushaashvatha shoabhaathishayamuthoa - bhaasillutanu joochi2. neelamaya nithya punaadhulu - maelimi ChaayaamaNulusooryakaaMtha sugMDhamulu - puShyaraaga nirmithamu3. nithya mahimathoa veligedu - muthyaala gummamulusvachChamagu suvarNamayamu - aashcharya nagaramu4. jeevavrukShmu jeevaphalamulu - jeevaamruthapaanamukaaMthi vMthamugaa merisaeti - viMthalugolpu nagaramu5. svarNa samamu dhaani prajalu sMthoaSh sahithuludhoothalae viMthapadunatlu khyaathini kaligina vaaru6. mMdhira samrudhDhini vaaru - thrupthi noMdhuchunnaaruaanMdha pravaahamunMdhu - paanamu chaeyuchunnaaru7. dhaevudu selavichchinayatti - dhaevoa kthulaloa naedhijarugakuMdaga poalaedhu - varusagaa neravaeren