• waytochurch.com logo
Song # 3581

seeyoanu vaasulaaraa sakala vaagdhaanamulu manavaayenuసీయోను వాసులారా సకల వాగ్దానములు మనవాయెను



Reference: ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. 2 పేతురు Peter 1:4

పల్లవి: సీయోను వాసులారా

అను పల్లవి: సకల వాగ్దానములు మనవాయెను
సాగిలపడి యేసుని ఆరాధించెదము

1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో
దాని నివాసులుగా మనలను దీవించెన్

2. సంతోషించుము దేశమ భయపడవలదు
గంతులు వేయుము ఘనకార్యములను చేయున్

3. పచ్చిక మొలచును ఫలియించును మరి తరులు
ఫలియించును ద్రాక్ష అంజూరపు చెట్లు

4. తొలకరి కడవరి వర్షము విస్తారముగా
తనదు నీతిని బట్టి మనకొసగును

5. కొట్లు ధాన్యముతో నిండి పొర్లును
క్రొత్త తైలము ద్రాక్షరసము పారును

6. పసరు గొంగలి చీడపురుగులు మిడుతల్
నాశనముచేసిన పంటను మీకొసగును

7. సర్వ శరీరులపై తన ఆత్మను పోసి
స్వప్నముల దర్శనముల మీ కొసగును

8. సీయోను వాసులు సిగ్గునొందరు
శేషము నిలిచి వాసము చేతురు ప్రభులో

9. ఆ దినమున యెహోవా నామమునందు
ప్రార్థించు వారు రక్షణ నొందెదరు



Reference: aayana manaku amoolyamulunu athyaDhikamulunaina vaagdhaanamulanu anugrahiMchiyunnaadu. 2 paethuru Peter 1:4

Chorus: seeyoanu vaasulaaraa

Chorus-2: sakala vaagdhaanamulu manavaayenu
saagilapadi yaesuni aaraaDhiMchedhamu

1. dhaeniki dhaevudu shilpiyu nirmaaNakudoa
dhaani nivaasulugaa manalanu dheeviMchen

2. sMthoaShiMchumu dhaeshama bhayapadavaladhu
gMthulu vaeyumu ghanakaaryamulanu chaeyun

3. pachchika molachunu phaliyiMchunu mari tharulu
phaliyiMchunu dhraakSh aMjoorapu chetlu

4. tholakari kadavari varShmu visthaaramugaa
thanadhu neethini batti manakosagunu

5. kotlu Dhaanyamuthoa niMdi porlunu
kroththa thailamu dhraakShrasamu paarunu

6. pasaru goMgali cheedapurugulu miduthal
naashanamuchaesina pMtanu meekosagunu

7. sarva shareerulapai thana aathmanu poasi
svapnamula dharshanamula mee kosagunu

8. seeyoanu vaasulu siggunoMdharu
shaeShmu nilichi vaasamu chaethuru prabhuloa

9. aa dhinamuna yehoavaa naamamunMdhu
praarThiMchu vaaru rakShNa noMdhedharu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com