సర్వములో సర్వదా యేసునే పాడెద యేసులో సమస్తము సమస్తము యేసే
Reference: నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ Philippians 3:8
1. పూర్వమాశీర్వాదము - నేడు శ్రీయేసే
మున్ను నా యాలోచన - నేడు తనమాట
మున్ను వరము కోరితి - నే డేసగు వానిన్
మున్ను స్వస్థత కోరితి - నేడు వానినే
పల్లవి: సర్వములో సర్వదా - యేసునే పాడెద
యేసులో సమస్తము - సమస్తము యేసే
2. మున్ను శోధన శ్రమ - నేడు నమ్మకం
ముందు అర్థరక్షణ - నేడు సంపూర్ణం
మున్ను విడువనిపట్టు - నేడేసు నన్ బట్టెన్
పూర్వము నే నస్థిరం - నేడు - స్థిరమైతి
3. మున్నునా ప్రయత్నము - నేడు ప్రార్థన
పూర్వమెంతో జాగ్రత్త - నేడతని శ్రద్ధ
మున్ను నాదుకోరిక - నేడేసుమాట
పూర్వ మడుగుచుండుట - నేడు సంస్తుతి
4. మున్ను నాపనియది - యికను తన పని
మున్ను తనను వాడితిన్ - నేడు నన్ వాడును
మున్ను శక్తి కోరితిన్ - నేడు శక్తునే
మున్ను నాకై చేసితిన్ - నేడు తనకే
5. మున్ను యేసును కోరితిన్ - నా వాడాయె నేడు
మున్ను జ్యోతులుగ నుండే - నే డేంతో కాంతి
మున్ను చావు గోరితి - నేడు తన రాకన్
నా నిరీక్షణలెల్ల – స్థిరమాయెను
Reference: nishchayamugaa naa prabhuvaina yaesukreesthunu goorchina athishraeShTamaina jnYaanamu nimiththamai samasthamunu naShtamugaa eMchukonuchunnaanu. philippee Philippians 3:8
1. poorvamaasheervaadhamu - naedu shreeyaesae
munnu naa yaaloachana - naedu thanamaat
munnu varamu koarithi - nae daesagu vaanin
munnu svasThatha koarithi - naedu vaaninae
Chorus: sarvamuloa sarvadhaa - yaesunae paadedh
yaesuloa samasthamu - samasthamu yaesae
2. munnu shoaDhana shrama - naedu nammakM
muMdhu arTharakShNa - naedu sMpoorNM
munnu viduvanipattu - naedaesu nan batten
poorvamu nae nasThirM - naedu - sThiramaithi
3. munnunaa prayathnamu - naedu praarThan
poorvameMthoa jaagraththa - naedathani shradhDh
munnu naadhukoarika - naedaesumaat
poorva maduguchuMduta - naedu sMsthuthi
4. munnu naapaniyadhi - yikanu thana pani
munnu thananu vaadithin - naedu nan vaadunu
munnu shakthi koarithin - naedu shakthunae
munnu naakai chaesithin - naedu thanakae
5. munnu yaesunu koarithin - naa vaadaaye naedu
munnu jyoathuluga nuMdae - nae daeMthoa kaaMthi
munnu chaavu goarithi - naedu thana raakan
naa nireekShNalella – sThiramaayenu