• waytochurch.com logo
Song # 3602

meeru bahugaa phalimchinachoa mahima kalugunu thmdrikiమీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి



Reference: మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను John 15:8

పల్లవి: మీరు బహుగా ఫలించినచో - మహిమ కలుగును తండ్రికి
ఈ రీతిగా ఫలించినతో శిష్యులై యుండెదరు

1. నీరు కట్టిన తోటవలె నీటి వూటవలె నుండెదరు
క్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును
బలపరచును మీ యెముకలను అధికముగా ఫలించుడి

2. చెట్లులేని మెట్టలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు
ఎండియున్న నేలనెల్ల నీటిబుగ్గలుగా జేయువాడు
మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి

3. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తనశాంతిని
ఐశ్వర్యముతో నొంపు మిమ్ము ముదిమివరకు మిమ్ము మోయువాడు
మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి

4. పాడేదరు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు
పొగడేదరు ప్రజలెల్లరు ప్రభుని ఆశ్చర్య కార్యములను
మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయ పాడెదరు



Reference: meeru bahugaa phaliMchutavalana naa thMdri mahimaparachabadunu; iMdhuvalana meeru naa shiShyulagudhuru. yoahaanu John 15:8

Chorus: meeru bahugaa phaliMchinachoa - mahima kalugunu thMdriki
ee reethigaa phaliMchinathoa shiShyulai yuMdedharu

1. neeru kattina thoatavale neeti vootavale nuMdedharu
kShaamamuloa thrupthi nichchi kShaemamugaa mimmu nadipiMchunu
balaparachunu mee yemukalanu aDhikamugaa phaliMchudi

2. chetlulaeni mettalaloa nadhula pravahiMpajaeyu prabhuvu
eMdiyunna naelanella neetibuggalugaa jaeyuvaadu
mana prabhuvaina yaesunMdhu aDhikamugaa phaliMchudi

3. vadigaa pravahiMchu nadhini boali visthariMpajaeyu thanashaaMthini
aishvaryamuthoa noMpu mimmu mudhimivaraku mimmu moayuvaadu
mana prabhuvaina yaesunMdhu aDhikamugaa phaliMchudi

4. paadaedharu moogavaaru gMthulu vaesedharu kuMtivaaru
pogadaedharu prajalellaru prabhuni aashcharya kaaryamulanu
mahima ghanatha chelliMchuchu hallelooya paadedharu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com