kreesthuni choochuchu saagivelledhanu seeyoanu yaathraloaక్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను సీయోను యాత్రలో
Reference: ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము హెబ్రీ. 12:1,21. క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను - సీయోను యాత్రలోలోకమున్ విడిచి చేరుకొందును మహిమ దేశమున్క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలోమహానందముతో స్తుతించుచు చేరుదు నాదేశమున్పల్లవి: ఎంతో సుందర జీవితము - మహిమతో నిండినది సదా సర్వదా క్రీస్తుతో నుండి మహిమ పరచెదను - మహిమలో నుండెదను2. దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు దాగుచోటు ఆయనేసంకటక్లేశ పరీక్షలలో జయము పొందెదనుప్రభునికై జీవించెదను ఆయన అడుగు జాడలలోఆత్మ ప్రాణ శరీరము లర్పించి ఆయనను సేవింతును3. యాత్రికుడను ఈ జగమందు - పరవాసినైతి నేనుస్వల్పజీవితము భువియందు గడిపి - చేరుదున్ ఆ దేశమున్నాకై విజ్ఞాపనము చేయు - మహాయాజకుడు యేసునితోతోడి వారసుడనై ఆయనతో - నిత్యము ఏలెదను
Reference: iMtha goppa saakShi samoohamu maeghamuvale manalanu aavariMchiyunnMdhuna manamu kooda prathibhaaramunu, suLuvugaa chikkulabettu paapamunu vidichipetti, vishvaasamunaku karthayu dhaanini konasaagiMchu vaadunaina yaesuvaipu choochuchu, mana yedhuta uMchabadina pMdhemuloa oapikathoa parugeththudhamu hebree. 12:1,21. kreesthuni choochuchu saagiveLLedhanu - seeyoanu yaathraloaloakamun vidichi chaerukoMdhunu mahima dhaeshamunkreesthuni anugrahamuloa surakShitha hasthamulaloamahaanMdhamuthoa sthuthiMchuchu chaerudhu naadhaeshamunChorus: eMthoa suMdhara jeevithamu - mahimathoa niMdinadhi sadhaa sarvadhaa kreesthuthoa nuMdi mahima parachedhanu - mahimaloa nuMdedhanu2. dhuHkha shramalaloa nannu rakShiMchu dhaaguchoatu aayanaesMkataklaesha pareekShlaloa jayamu poMdhedhanuprabhunikai jeeviMchedhanu aayana adugu jaadalaloaaathma praaNa shareeramu larpiMchi aayananu saeviMthunu3. yaathrikudanu ee jagamMdhu - paravaasinaithi naenusvalpajeevithamu bhuviyMdhu gadipi - chaerudhun aa dhaeshamunnaakai vijnYaapanamu chaeyu - mahaayaajakudu yaesunithoathoadi vaarasudanai aayanathoa - nithyamu aeledhanu