prabhuyaesu naa rakshkaa nosagu kannulu naakuప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు
Reference: యేసువైపు చూచుచు ... పందెములో ఓపికతో పరుగెత్తుదము. హెబ్రీ Hebrews 12:2పల్లవి: ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను జూడ - అల్ఫయు నీవే - ఓమేగయు నీవే1. ప్రియుడైన యోహాను పత్మాసులోప్రియమైన యేసూ - నీ స్వరూపముప్రియమార జూచి - బహు ధన్యుడయ్యెప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము2. లెక్కలేని మార్లు - పడిపోతినిదిక్కులేనివాడ - నే నైతినిచక్కజేసి నా - నేత్రాలు దెరచిగ్రక్కున - నిన్ను జూడనిమ్ము3. ఎఱిగి ఎఱిగి నే - చెడిపోతినియేసు నీ గాయము - రేపితినిమోసపోతి నేను - దృష్టి దొలగితిదాసుడ నన్ను - జూడనిమ్ము4. ఎందరేసుని వైపు - చూచెదరోపొందెదరు వెల్గు - ముఖమునసందియంబు లేక - సంతోషించుచుముందుకు - పరుగెత్తెదరు5. విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూకొనసాగించువాడా - యేసు ప్రభూవినయముతో నేను - నీవైపు జూచుచువిసుగక - పరుగెత్త నేర్పు6. కంటికి కనబడని - వెన్నియోచెవికి వినబడని - వెన్నియోహృదయ గోచరము - కాని వెన్నియోసిద్ధపరచితివా - నాకై7. లోక భోగాలపై - నా నేత్రాలుసోకకుండునట్లు - కృపజూపుమునీ మహిమ దివ్య - స్వరూపమునునిండార నను - జూడనిమ్ము
Reference: yaesuvaipu choochuchu ... pMdhemuloa oapikathoa parugeththudhamu. hebree Hebrews 12:2Chorus: prabhuyaesu naa rakShkaa - nosagu kannulu naaku nirathamu nae ninnu jooda - alphayu neevae - oamaegayu neevae1. priyudaina yoahaanu pathmaasuloapriyamaina yaesoo - nee svaroopamupriyamaara joochi - bahu Dhanyudayyepriya prabhu - ninnu joodanimmu2. lekkalaeni maarlu - padipoathinidhikkulaenivaada - nae naithinichakkajaesi naa - naethraalu dherachigrakkuna - ninnu joodanimmu3. eRigi eRigi nae - chedipoathiniyaesu nee gaayamu - raepithinimoasapoathi naenu - dhruShti dholagithidhaasuda nannu - joodanimmu4. eMdharaesuni vaipu - choochedharoapoMdhedharu velgu - mukhamunsMdhiyMbu laeka - sMthoaShiMchuchumuMdhuku - parugeththedharu5. vishvaasakarthaa - oa yaesu prabhookonasaagiMchuvaadaa - yaesu prabhoovinayamuthoa naenu - neevaipu joochuchuvisugaka - parugeththa naerpu6. kMtiki kanabadani - venniyoacheviki vinabadani - venniyoahrudhaya goacharamu - kaani venniyoasidhDhaparachithivaa - naakai7. loaka bhoagaalapai - naa naethraalusoakakuMdunatlu - krupajoopumunee mahima dhivya - svaroopamununiMdaara nanu - joodanimmu