• waytochurch.com logo
Song # 3630

nimpumu oa prabhuvaa sarva smpoornathathoaనింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో



Reference: మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ... ఎఫెసీ Ephesians 3:18

పల్లవి: నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో
మేము నిండియుండెదము - పరిపూర్ణత నొందెదము

1. పాప క్షమాపణ నిచ్చి - జీవముతో నింపుము
ఆత్మీయ వరమిచ్చిన - బలముతో నిండెదము

2. పరమ సంతోషమిచ్చి - సమాధానంబిమ్ము
చూపించు పరలోకమహిమ - ప్రకాశముతో నింపు

3. ఆత్మ ఫలములతో నింపి - ప్రేమ సంతోషము
మంచితనము సాత్వీకము విశ్వాసముతో నింపు

4. నింపు సత్యముతో మమ్ము నిల్పు - ప్రత్యక్షతలో
నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము

5. పరమాశీర్వాదమిచ్చి - తప్పించు యిహమునుండి
అర్హులుగ చేయు పరమునకై - ఆశించుచున్నాము



Reference: meeru dhaevuni sMpoorNatha yMdhu poorNulagunatlugaa ... ephesee Ephesians 3:18

Chorus: niMpumu oa prabhuvaa! sarva sMpoorNathathoa
maemu niMdiyuMdedhamu - paripoorNatha noMdhedhamu

1. paapa kShmaapaNa nichchi - jeevamuthoa niMpumu
aathmeeya varamichchina - balamuthoa niMdedhamu

2. parama sMthoaShmichchi - samaaDhaanMbimmu
choopiMchu paraloakamahima - prakaashamuthoa niMpu

3. aathma phalamulathoa niMpi - praema sMthoaShmu
mMchithanamu saathveekamu vishvaasamuthoa niMpu

4. niMpu sathyamuthoa mammu nilpu - prathyakShthaloa
nee jnYaanamuthoa niMpina sthuthithoa niMdedhamu

5. paramaasheervaadhamichchi - thappiMchu yihamunuMdi
arhuluga chaeyu paramunakai - aashiMchuchunnaamu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com