karunimchumu naa yaesuvaa kanikarammdhaishvaryudaaకరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా
Reference: దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా న్యాయము తీర్చడా? లూకా Luke 18:7పల్లవి: కరుణించుము నా యేసువా - కనికరమందైశ్వర్యుడా రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరబెట్టు - ప్రార్థనకు చెవి యొగ్గుమా1. నిత్యము మాకై విజ్ఞాపన చేయు - నిశీదరాత్రిన్ ప్రియుడాప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే - ప్రియుల ప్రార్థన వినుమా2. మా బంధు జనులు మా తల్లి దండ్రులు - మా ప్రియులు నశియించుటచూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా3. నీనెవె పట్టణ దుర్గతిని జూచి - కరుణించి కాపాడితివేయోనా మొరకొసగిన ఆలోచన నా కొసగ - నా బీదమనవి వినుమా4. శ్రమలెన్నో సహించి రక్షించితివే - ఇవియన్నియు వ్యర్థంబౌనా?అంజూరపు చెట్టుకై ప్రార్థించినా యట్టి ఆ ప్రార్థన వినుమా5. శోధన నుండి రక్షించితివే - సొదొమలో భక్తునిఅబ్రాహాం ఆనాడు విన్నపించినట్టి - ఆది ప్రార్థన వినుమా
Reference: dhaevudu thaanu aerparachukoninavaaru dhivaaraathrulu thannu goorchi moRRapettukonuchuMdagaa nyaayamu theerchadaa? lookaa Luke 18:7Chorus: karuNiMchumu naa yaesuvaa - kanikaramMdhaishvaryudaa raeyiMbagaLLu nae nelugeththi morabettu - praarThanaku chevi yoggumaa1. nithyamu maakai vijnYaapana chaeyu - nisheedharaathrin priyudaapraemapithaa naedu mee edhuta praarThiMchae - priyula praarThana vinumaa2. maa bMDhu janulu maa thalli dhMdrulu - maa priyulu nashiyiMchutchoochi sahiMpaka kanneetithoa chaeyu maa praarThana vinumaa3. neeneve pattaNa dhurgathini joochi - karuNiMchi kaapaadithivaeyoanaa morakosagina aaloachana naa kosaga - naa beedhamanavi vinumaa4. shramalennoa sahiMchi rakShiMchithivae - iviyanniyu vyarThMbaunaa?aMjoorapu chettukai praarThiMchinaa yatti aa praarThana vinumaa5. shoaDhana nuMdi rakShiMchithivae - sodhomaloa bhakthuniabraahaaM aanaadu vinnapiMchinatti - aadhi praarThana vinumaa