• waytochurch.com logo
Song # 3634

nee paadha sannidhiki krupaamaya yaesayyaaనీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా



Reference: మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీ Hebrews 4:16

పల్లవి: నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని

1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను

2. ప్రార్థించుమంటివి ప్రభువా - సంకట సమయములో
దయచూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా

3. నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము
మనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను

4. నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము

5. ఆశతో నీ ముఖమును నేను - ఆసక్తితో చూడ
సిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ

6. శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపు
నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము

7. జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ము
ఫలించి వర్థిల్లుతకై - ప్రభువా నీ కృప నిమ్ము

8. సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా
కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను



Reference: manamu kanikariMpabadi samayoachithamaina sahaayamukoraku krupa poMdhunatlu Dhairyamuthoa krupaasanamunodhdhaku chaerudhamu. hebree Hebrews 4:16

Chorus: nee paadha sanniDhiki - krupaamaya yaesayyaa
nee praema kanugonuchu - dhaevaa nae vachchithini

1. vishraaMthi nichchedu dhaevaa - shramalella theerchumayyaa
siluvayae naa aashrayamu - haayigaa nachatuMdedhanu

2. praarThiMchumMtivi prabhuvaa - sMkata samayamuloa
dhayachoopi nanu karuNiMchi - praemathoa aadhariMchumayyaa

3. naramaathrudavu neevu kaavu - moRa naalakiMchumu
manassaara praarThiMchuchu - yaesu needhari chaeredhanu

4. nannu chaeyi viduvaku naaThaa - niMdhalennoa poMdhinanu
neekai sahiMchedhanMtha - nee balamu naa kimmu

5. aashathoa nee mukhamunu naenu - aasakthithoa chood
siggupadanugaa naenu - nee prakaashamu naapai nuMd

6. shathruvu noadiMchutaku - nee shakthini choopu
nannaadhariMchi neevu - aavariMchi kaapaadumu

7. jeeviMchi edhugunatlu - jaya jeevithMbimmu
phaliMchi varThilluthakai - prabhuvaa nee krupa nimmu

8. seeyoanu moolaraayi - ayyunna oa prabhuvaa
kalathanu cheMdhaka naenu - neekai kanipettedhanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com