అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ తప్పక యిచ్చున్
Reference: అడుగుడి మీ కియ్యబడును మత్తయి Matthew 7:7
పల్లవి: అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ - తప్పక యిచ్చున్
అడిగెడి ప్రతివాడు పొందున్
1. భక్తులుభక్తులు విశ్వాసముతో - ప్రార్థించి పొందిరి
వారి జీవితముల నెంచి చూచి
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
2. మనలో తన శక్తికొలది - అనుగ్రహించును
ఊహకుమించి చేయు దేవునిని
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
3. మన ప్రార్థనల నాలకించి - సంతృప్తి చెందును
తన నామమునకు మహిమ కలుగ
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
4. ఇదివరకు మీరేమియు - అడుగకుంటిరి
మీరానంద భరితులగునట్లు
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
5. దేవుని కేదైనను - చేయ నసాధ్యమా
సర్వశక్తిగల మన దేవునడిగి
ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు
Reference: adugudi mee kiyyabadunu maththayi Matthew 7:7
Chorus: adugudi meeru mana prabhuvichchun - thappaka yichchun
adigedi prathivaadu poMdhun
1. bhakthulubhakthulu vishvaasamuthoa - praarThiMchi poMdhiri
vaari jeevithamula neMchi choochi
mee maelu korakai praarThiMchi poMdhu
2. manaloa thana shakthikoladhi - anugrahiMchunu
oohakumiMchi chaeyu dhaevunini
mee maelu korakai praarThiMchi poMdhu
3. mana praarThanala naalakiMchi - sMthrupthi cheMdhunu
thana naamamunaku mahima kalug
mee maelu korakai praarThiMchi poMdhu
4. idhivaraku meeraemiyu - adugakuMtiri
meeraanMdha bharithulagunatlu
mee maelu korakai praarThiMchi poMdhu
5. dhaevuni kaedhainanu - chaeya nasaaDhyamaa
sarvashakthigala mana dhaevunadigi
prabhu mahima korakai praarThiMchi poMdhu