ఓ కరుణానిధీ మహా ప్రభుయేసు నీవే సింహాసనాసీనుడవైతివి
Reference: సింహాసనమందు ఆసీనుడై యుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంధమును తీసికొనెను ప్రకటన 5:7
పల్లవి: ఓ కరుణానిధీ, మహా ప్రభుయేసు - నీవే సింహాసనాసీనుడవైతివి
1. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు - దావీదు తాళము కల్గియున్నావు
నీవు తెరచినది మూయగలేరు
బంధించినది తెరువగలేరెవ్వరు - నీ మహాత్మ్యమదే
2. ఏడు నక్షత్రములు నీచేత కలవు - దీప స్తంభముల మధ్య
సంచరించెదవు - జీవించువాడవు ఆది అంతములు - రెండంచుల
ఖడ్గం కలిగిన ప్రభువా - అదియే నీ ఘనత
3. అగ్నివంటి నేత్రములు కల్గి - అపరాపరంజి వంటి పాదములు కలిగి
దేవుని ఏడు ఆత్మలు కలిగి - గ్రంధము తెరచే యోగ్యుడవీవే
ధన్యుడవు నీవే
4. నమ్మకమైన సత్యసాక్షియు - సర్వసృష్టికి కర్తయైయుండి
నీతిమంతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు
శక్తిమంతుడు - ఆమెన్ అనువాడు
5. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు - సాగిల పడెదరు కృతజ్ఞులై
ఆశ్చర్యక్రియలు చేసితివంచు - ప్రభువా నీవే అగమ్యుడవంచు
నినుకొనియాడెదము
Reference: siMhaasanamMdhu aaseenudai yuMduvaani kudichaethiloa nuMdi aa grMDhamunu theesikonenu prakatana 5:7
Chorus: oa karuNaaniDhee, mahaa prabhuyaesu - neevae siMhaasanaaseenudavaithivi
1. sathyasvaroopivi parishudhDhudavu - dhaaveedhu thaaLamu kalgiyunnaavu
neevu therachinadhi mooyagalaeru
bMDhiMchinadhi theruvagalaerevvaru - nee mahaathmyamadhae
2. aedu nakShthramulu neechaetha kalavu - dheepa sthMbhamula maDhy
sMchariMchedhavu - jeeviMchuvaadavu aadhi aMthamulu - reMdMchul
khadgM kaligina prabhuvaa - adhiyae nee ghanath
3. agnivMti naethramulu kalgi - aparaaparMji vMti paadhamulu kaligi
dhaevuni aedu aathmalu kaligi - grMDhamu therachae yoagyudaveevae
Dhanyudavu neevae
4. nammakamaina sathyasaakShiyu - sarvasruShtiki karthayaiyuMdi
neethimMthudu bahujvaalaamayudu dheerghashaaMthudu
shakthimMthudu - aamen anuvaadu
5. ellaru prabhuni sthuthiMchedharu - saagila padedharu kruthajnYulai
aashcharyakriyalu chaesithivMchu - prabhuvaa neevae agamyudavMchu
ninukoniyaadedhamu