visugakumdaa nithyamu praarthimcha valenaniవిసుగకుండా నిత్యము ప్రార్థించ వలెనని
Reference: వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని చెప్పెను లూకా Luke 18:2
పల్లవి: విసుగకుండా నిత్యము - ప్రార్థించ వలెనని
విశదముగా నుడివితివి - విసుగకుండా నిత్యము
1. ఏకీభవించి భువిపైన యిద్దరు - వేడుకొను సంగతులను గూర్చి
నా తండ్రివలన దొరుకునని - నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా
2. ఆది అపొస్తలుల యేక భావముగా - ఎడతెగక నిను ప్రార్థించగా
వారి మొఱ నాలించిన ప్రభువా - మా మొఱ నీ చెంతకు రానిమ్ము
3. పేతురపొస్తలుడు చెరసాలలో నుండ - అత్యాసక్తిగా ప్రార్థించగా
ఆనాటి శిష్యులు కనిరి - నీ గొప్ప మహాత్మ్యమును
4. నా యందు మీరు మీలో నావాక్యము - నిలిచియుండిన యెడల మీకు
ఏది ఇష్టమో దాని నడిగి - పొందుమంటివి క్రీస్తు ప్రభువా
5. ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ - విసుగక కూడియుందురో
అందరి మధ్యనుండే ప్రభువా - రమ్ము మా మధ్యకు నేడే
Reference: vaaru visugaka nithyamu praarThana chaeyavalenani cheppenu lookaa Luke 18:2
Chorus: visugakuMdaa nithyamu - praarThiMcha valenani
vishadhamugaa nudivithivi - visugakuMdaa nithyamu
1. aekeebhaviMchi bhuvipaina yidhdharu - vaedukonu sMgathulanu goorchi
naa thMdrivalana dhorukunani - nokki cheppina goppa prabhuvaa
2. aadhi aposthalula yaeka bhaavamugaa - edathegaka ninu praarThiMchagaa
vaari moRa naaliMchina prabhuvaa - maa moRa nee cheMthaku raanimmu
3. paethuraposthaludu cherasaalaloa nuMda - athyaasakthigaa praarThiMchagaa
aanaati shiShyulu kaniri - nee goppa mahaathmyamunu
4. naa yMdhu meeru meeloa naavaakyamu - nilichiyuMdina yedala meeku
aedhi iShtamoa dhaani nadigi - poMdhumMtivi kreesthu prabhuvaa
5. idhdharu mugguru naa naamamuna yekkada - visugaka koodiyuMdhuroa
aMdhari maDhyanuMdae prabhuvaa - rammu maa maDhyaku naedae