• waytochurch.com logo
Song # 3666

rakshna aunnathyamu rakshkudae thelupunu parvatha shikhara shraenulavalenae nishchalamainadhiరక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది



Reference: దేశముయొక్క ఉన్నతస్థలముల మీద నేను నిన్నెక్కించెదను యెషయా Isaiah 58:14

పల్లవి: రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును
పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది

1. మలిన వస్త్రమువలెనే - నిండియుంటిమి నిందలతో
తండ్రిమాదిరిగా మము వెదకివచ్చి వింతగా మమ్మురక్షించెను

2. అరణ్య ప్రదేశములో - పాడైన యెడారిలో
కనుగొనెను, పరామర్శించెన్ కనుపాపవలె గాచెన్

3. యాకోబువలె నుంటిమి - ఇశ్రాయేలుగా మార్చెను
తన స్వాస్థ్యముగా, తన భాగముగా తన జనముగానైతిమి

4. పర్వతములను సృజించెన్ - శ్రేష్టమైనవి నిచ్చెన్
అబ్రహాం మోషే ఏలియా యేసు ఎక్కిరి శిఖరములను

5. పక్షిరాజువలె ప్రభువు - రెక్కలతో మము మోయున్
అలసట లేక, మము పట్టుకొని ఆకసమున నడుపును

6. యేసుని సత్యములు - పర్వత శిఖరములు
పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింప జేయును

7. యేషయా ప్రవచనములు - రక్షణ వివరములు
శిఖర శ్రేణి యనుభవములు శిఖరముపై పొందుము



Reference: dhaeshamuyokka unnathasThalamula meedha naenu ninnekkiMchedhanu yeShyaa Isaiah 58:14

Chorus: rakShNa aunnathyamu rakShkudae thelupunu
parvatha shikhara shraeNulavalenae nishchalamainadhi

1. malina vasthramuvalenae - niMdiyuMtimi niMdhalathoa
thMdrimaadhirigaa mamu vedhakivachchi viMthagaa mammurakShiMchenu

2. araNya pradhaeshamuloa - paadaina yedaariloa
kanugonenu, paraamarshiMchen kanupaapavale gaachen

3. yaakoabuvale nuMtimi - ishraayaelugaa maarchenu
thana svaasThyamugaa, thana bhaagamugaa thana janamugaanaithimi

4. parvathamulanu srujiMchen - shraeShtamainavi nichchen
abrahaaM moaShae aeliyaa yaesu ekkiri shikharamulanu

5. pakShiraajuvale prabhuvu - rekkalathoa mamu moayun
alasata laeka, mamu pattukoni aakasamuna nadupunu

6. yaesuni sathyamulu - parvatha shikharamulu
paripoorNamagu prabhu rakShNanu parikiMpa jaeyunu

7. yaeShyaa pravachanamulu - rakShNa vivaramulu
shikhara shraeNi yanubhavamulu shikharamupai poMdhumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com