paramu dhigenu mahima nimdenaaloa siluva yodhdha svasthatha kaligenuపరము దిగెను మహిమ నిండెనాలో సిలువ యొద్ద స్వస్థత కలిగెను
Reference: దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ... మా హృదయములలో ప్రకాశించెను 2 కొరింథీ Corinthians 4:6
1. హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం
నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె
హా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కరతీర్చెను
మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్
పల్లవి: పరము దిగెను మహిమ నిండెనాలో
సిలువ యొద్ద స్వస్థత కలిగెను
నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను
పరము దిగెను మహిమ నిండెనాలో
2. పరిశుద్ధ ఆత్మతో జన్మించితివి దేవుని గృహమందు
కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము
తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా
కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము
3. నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే
భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్
నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం
నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి
Reference: dhaevudae thana mahimanu goorchina jnYaanamu ... maa hrudhayamulaloa prakaashiMchenu 2 koriMThee Corinthians 4:6
1. haa! eMtha adhbhuthaashcharya dhinamu - ennadu maruvani dhinM
nae cheekatiloa thiriginapudu yaesu nannu sMDhiMche
haa! eMtha jaaligala mithrudu hrudhaya akkaratheerchenu
maraNachchaayalu poaye mudhamuna thelipedha - cheekatinMtha baapen
Chorus: paramu dhigenu mahima niMdenaaloa
siluva yodhdha svasThatha kaligenu
naa paapM kadigenu raathri pagalai maarenu
paramu dhigenu mahima niMdenaaloa
2. parishudhDha aathmathoa janmiMchithivi dhaevuni gruhamMdhu
kalvari praemachae kalgeneethi oa eMtha aunnathyamu
theermaanamu jarige vaegamugaa paapigaa naenu raagaa
krupanichche dhaani nae sveekariMchagaa rakShiMchenu sthoathramu
3. nishchayamuga paramMdhunna kaalamu theeraganae
bhavanamulu naakMdhunnavani sThiramuganae nammudhun
nammi siluvanae chaerinanaadae adhiyae adhbhuthadhinM
nithyaishvaryamee dheevenalu poMdhithi prabhu hasthamunuMdi