• waytochurch.com logo
Song # 3688

priyudaa prabhu yaesunaku nee veenula nimmuప్రియుడా ప్రభు యేసునకు నీ వీనుల నిమ్ము



Reference: మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యోహాను John 15:16

పల్లవి: ప్రియుడా ప్రభు యేసునకు - నీ వీనుల నిమ్ము
ప్రియుడా ప్రభు యేసునకు - విశాల స్థలమిమ్ము
ప్రియుడా ప్రభు యేసునకు - విస్తార ఫలమిమ్ము

1. సర్వాధికారియైన యేసు - సర్వశక్తి గలవాడు
సర్వజనులలోన - శిష్యుల జేయుమనెన్

2. జనముల నీదు స్వాస్థ్యముగ - భూమి దిగంతముల వరకు
నన్నడుగుడి మీదు సొత్తు - గా నిచ్చెదననెన్

3. పర్వతముల నీవు యెక్కి - మ్రానులను కొట్టి తెచ్చి
మందిరము కట్టిన - మది నుల్లసింతుననెన్

4. కోత సమయమింక కొంత - కాలమున్నదనేదంత
తెల్లబారిన పొలముల్ - కన్నుల గాంచుమనెన్

5. ప్రతివాడు తన స్వంత పనులే - చింత గలిగి చేసెదరిలలో
ప్రభు యేసు పనులన్ నీవు - పాటింప కుండెదవా?

6. నీ దేహమును నీది కాదు - విలువపెట్టి కొన్నాడేసు
నీ దేహమాయన కిమ్ము - సజీవ యాగముగ

7. ప్రతివాని పనుల పరికించి - ఫలము నియ్య ప్రభుడిలకొచ్చున్
ప్రతిచోట నీవు ఫలములన్ ఫలించుచుండు మిలన్



Reference: meeru veLli phaliMchutakunu, mee phalamu nilichiyuMdutakunu naenu mimmunu aerparachukoni niyamiMchithini. yoahaanu John 15:16

Chorus: priyudaa prabhu yaesunaku - nee veenula nimmu
priyudaa prabhu yaesunaku - vishaala sThalamimmu
priyudaa prabhu yaesunaku - visthaara phalamimmu

1. sarvaaDhikaariyaina yaesu - sarvashakthi galavaadu
sarvajanulaloana - shiShyula jaeyumanen

2. janamula needhu svaasThyamuga - bhoomi dhigMthamula varaku
nannadugudi meedhu soththu - gaa nichchedhananen

3. parvathamula neevu yekki - mraanulanu kotti thechchi
mMdhiramu kattina - madhi nullasiMthunanen

4. koatha samayamiMka koMtha - kaalamunnadhanaedhMth
thellabaarina polamul - kannula gaaMchumanen

5. prathivaadu thana svMtha panulae - chiMtha galigi chaesedharilaloa
prabhu yaesu panulan neevu - paatiMpa kuMdedhavaa?

6. nee dhaehamunu needhi kaadhu - viluvapetti konnaadaesu
nee dhaehamaayana kimmu - sajeeva yaagamug

7. prathivaani panula parikiMchi - phalamu niyya prabhudilakochchun
prathichoata neevu phalamulan phaliMchuchuMdu milan



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com