• waytochurch.com logo
Song # 3692

nee priya prabhuni saevakai arpimchukoa neevaeనీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే



Reference: కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. రోమా Romans 12:1

పల్లవి: నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే

1. అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే
ఆ వెలుగు ద్వారానే - నూతనమార్గము కలిగే
సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే

2. తప్పిపోతివి గతమందు - తప్పు దారిని నడిచితివి
తన ప్రేమాహస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్

3. ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని
ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె
నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము

4. యెవరతని నేవించెదరో - ఫలమొందెదరంతమందు
ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీ కిచ్చె
కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని



Reference: kaabatti sahoadharulaaraa, parishudhDhamunu dhaevuniki anukoolamunaina sajeeva yaagamugaa mee shareeramulanu aayanaku samarpiMchukonudani dhaevuni vaathsalyamunubatti mimmunu bathimaalukonuchunnaanu. itti saeva meeku yuktha mainadhi. roamaa Romans 12:1

Chorus: nee priya prabhuni saevakai - arpiMchukoa neevae
pavithra prajalaina meeru - saeviMchudaayananae

1. aMDhakaara jeevithamunaku - velugu thechchenu thaanae
aa velugu dhvaaraanae - noothanamaargamu kaligae
sajeeva baligaa narpiMchu - nee jeevithamaayanakae

2. thappipoathivi gathamMdhu - thappu dhaarini nadichithivi
thana praemaahasthamae - ninnu kaapaadi thechchenu
yeMthaina smariyiMchu neevu - viMthaina thana praeman

3. oa priyudaa thalachithivaa - nee janmamae paapamani
prabhuvae thana rakthamuthoa - nee paapamu kShmiyiMche
nee yullamu aayana kaalayamae - jnYaapakamuMchukonumu

4. yevarathani naeviMchedharoa - phalamoMdhedharMthamMdhu
itharulaku laenatti - aa ghanathanu nee kichche
kruthajnYudavai koniyaadu - prabhupaadha sanniDhini


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com