• waytochurch.com logo
Song # 3717

adhikaaramu pomdhi yumtini prabhooఅధికారము పొంది యుంటిని ప్రభూ



Reference: అయితే యేసు వారి యొద్దకు వచ్చి ― పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. మత్తయి Matthew 28:18

పల్లవి: అధికారము పొంది యుంటిని - ప్రభూ
పరలోకమందును భూమి మీదను - నీవు

1. అన్నిటిలో నత్యధిక జయము నొందుచున్నాము
మనల ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభువు ద్వారనే
కనుల కగుపరచిన విజయముకై సన్నుతింతుము

2. విశ్వసించు మనయందు తన శక్తిని గూర్చి
అపరిమితమైన ప్రబావమును - యెరిగి యున్నాము
తిరిగి లేచిన ప్రభువును చూచి హర్షించెదము

3. మనల బలపరచు ప్రభువునందు బలము నొందుచు
ప్రభున కింపైన కార్యములను చేయుచుంటిమి
తనదు పునరుత్థాన బలమును పొగడెదమెపుడు

4. క్రీస్తు మరణములో సమానాను-భవము కలిగియు
కష్ట నష్టములలో పాలివారమగుట యెరిగియు
ఆత్మ ప్రాణ శరీరములతో ఆరాధింతము

5. మనల స్థిరపరచిన శక్తిగల దేవునికి
తనదు ప్రియ పుత్రుడు యేసుక్రీస్తు ద్వారనే తనకు
నిరతంబును మహిమ ఘనత హల్లెలూయామెన్



Reference: ayithae yaesu vaari yodhdhaku vachchi ― paraloakamMdhunu bhoomimeedhanu naaku sarvaaDhikaaramu iyyabadiyunnadhi. maththayi Matthew 28:18

Chorus: aDhikaaramu poMdhi yuMtini - prabhoo
paraloakamMdhunu bhoomi meedhanu - neevu

1. annitiloa nathyaDhika jayamu noMdhuchunnaamu
manala praemiMchina yaesu kreesthu prabhuvu dhvaaranae
kanula kaguparachina vijayamukai sannuthiMthumu

2. vishvasiMchu manayMdhu thana shakthini goorchi
aparimithamaina prabaavamunu - yerigi yunnaamu
thirigi laechina prabhuvunu choochi harShiMchedhamu

3. manala balaparachu prabhuvunMdhu balamu noMdhuchu
prabhuna kiMpaina kaaryamulanu chaeyuchuMtimi
thanadhu punaruthThaana balamunu pogadedhamepudu

4. kreesthu maraNamuloa samaanaanu-bhavamu kaligiyu
kaShta naShtamulaloa paalivaaramaguta yerigiyu
aathma praaNa shareeramulathoa aaraaDhiMthamu

5. manala sThiraparachina shakthigala dhaevuniki
thanadhu priya puthrudu yaesukreesthu dhvaaranae thanaku
nirathMbunu mahima ghanatha hallelooyaamen



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com