• waytochurch.com logo
Song # 3731

dhanyudavu neevu dhanyudavu oa ishraayaelu bahu dhanyudavuధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు



Reference: ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ద్వితియోపదేశకాండము Deuteronomy 33:29

పల్లవి: ధన్యుడవు నీవు ధన్యుడవు
ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు
యెహోవాయే నిన్ను విమోచించెను
ప్రజలలో నీవు మహా శ్రేష్టుడవు ధన్యుడవు

1. నీ పాపము పరిహారమాయె
నీ యతిక్రమము తుడువబడెన్
నిర్దోషియని నిన్నెంచె ప్రభు
ఆత్మలో కపటము లేదనెను

2. ఏర్పరచబడిన ధన్యుడవు
దరిజేరితివి నీ ప్రభుకడకు
చేర్చెను తన మందిరములోన
తృప్తిపరచె దాని సమృధ్దిచే

3. దుష్టుల యోచనలో వెళ్ళక
పాపుల మార్గమున నిలువక
అపహాసకులతో కూర్చుండక
ధర్మశాస్త్రము ధ్యానించునీవు

4. ప్రభునిచే నీవు బలమొంది
ప్రభు మార్గము నీయందుండి
జలములలో నీవు నడచుచు
జలమయముగా చేయు నీవు

5. యెహోవాయే ఉత్తముడని
రుచిచూచి మరి ప్రభు నెరిగి
మహోన్నతుని ఆశ్రయించి
ఆరాధించు నీవు ధన్యుడవు



Reference: ishraayaeloo, nee bhaagyameMtha goppadhi! yehoavaa rakShiMchina ninnu poalinavaadevadu? dhvithiyoapadhaeshakaaMdamu Deuteronomy 33:29

Chorus: Dhanyudavu neevu Dhanyudavu
oa ishraayaelu bahu Dhanyudavu
yehoavaayae ninnu vimoachiMchenu
prajalaloa neevu mahaa shraeShtudavu Dhanyudavu

1. nee paapamu parihaaramaaye
nee yathikramamu thuduvabaden
nirdhoaShiyani ninneMche prabhu
aathmaloa kapatamu laedhanenu

2. aerparachabadina Dhanyudavu
dharijaerithivi nee prabhukadaku
chaerchenu thana mMdhiramuloan
thrupthiparache dhaani samruDhdhichae

3. dhuShtula yoachanaloa veLLak
paapula maargamuna niluvak
apahaasakulathoa koorchuMdak
Dharmashaasthramu DhyaaniMchuneevu

4. prabhunichae neevu balamoMdhi
prabhu maargamu neeyMdhuMdi
jalamulaloa neevu nadachuchu
jalamayamugaa chaeyu neevu

5. yehoavaayae uththamudani
ruchichoochi mari prabhu nerigi
mahoannathuni aashrayiMchi
aaraaDhiMchu neevu Dhanyudavu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com