nae bhramimchi nilchithi praema pravaahamu thaerichoochiనే భ్రమించి నిల్చితి ప్రేమ ప్రవాహము తేరిచూచి
Reference: యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను హెబ్రీ Hebrews 13:12
1. నే భ్రమించి నిల్చితి ప్రేమ - ప్రవాహము తేరిచూచి
నా హృదయమందు సంపూర్ణ - సమాధానము నొందితిన్
పల్లవి: పవిత్ర రక్తముచేత - నా పాపమెల్ల తీరె
నాదరణ పొందితినిపుడు - రక్షకుని రక్తముచే
2. మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది
వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి
3. తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్
నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని
4. నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను
తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్
Reference: yaesukooda thana svarakthamuchaetha prajalanu parishudhDhaparachutakai gavini velupata shramapoMdhenu hebree Hebrews 13:12
1. nae bhramiMchi nilchithi praema - pravaahamu thaerichoochi
naa hrudhayamMdhu sMpoorNa - samaaDhaanamu noMdhithin
Chorus: pavithra rakthamuchaetha - naa paapamella theere
naadharaNa poMdhithinipudu - rakShkuni rakthamuchae
2. munmuMdhu ee oadhaarpu chooda - migula prayaasanoMdhi
vyarThaprayaasa veedinMtha - rakShkuni krupanoMdhithi
3. thana karamu naa meedhanuMchi - nannu svasThapadumanen
nae naayana vasthramu mutti - aaroagyamu poMdhithini
4. nirMtharamu puNya naaThuMdu - naa prakka nuMdhunanenu
thanamukha bhaasuramuchaetha - naa yedhanu niMpuchuMdun