prabhuvaa nee paripoornatha numdi pomdhithimi krupavembadi krupanuప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృపవెంబడి కృపను
Reference: నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి Haggai 2:5పల్లవి: ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృపవెంబడి కృపను1. ప్రభువైన యేసుక్రీస్తు - పరలోక విషయములోప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు2. జనకా నీ వెన్నుకొనిన - జనుల క్షేమముజూచిసంతోషించునట్లు - నను జ్ఞాపకముంచుకొనుము3. నీదుస్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసికొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము4. దేవా నీ ప్రజల యెడల - దినదినము నీకున్నఘనుడా నీదు దయతో - నను జ్ఞాపకముంచుకొనుము5. దేవా నీదు స్వరూప - దివ్యదర్శనమునుదినదినము నాకొసగి - నను జ్ఞాపకముంచుకొనుము6. మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకుడనిన మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము7. ముదమార నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగనుచేతుననిన ప్రభువా - నను జ్ఞాపకముంచుకొనుము8. కృపా సత్య సమ్మిలిత - నంపూర్ణ స్వరూపహల్లెలూయ నీకే ప్రభో - ఎల్లప్పుడు కలుగునుగాక
Reference: naa aathma mee maDhyana unnadhi ganuka bhayapadakudi. haggayi Haggai 2:5Chorus: prabhuvaa nee paripoorNatha nuMdi poMdhithimi krupaveMbadi krupanu1. prabhuvaina yaesukreesthu - paraloaka viShyamuloaprathi aasheervaadhamunu - prasaadhiMchithivi maaku2. janakaa nee vennukonina - janula kShaemamujoochisMthoaShiMchunatlu - nanu jnYaapakamuMchukonumu3. needhusvaasThyamainatti - nee prajalathoa kalisikoniyaadunatlugaa - nanu jnYaapakamuMchukonumu4. dhaevaa nee prajala yedala - dhinadhinamu neekunnghanudaa needhu dhayathoa - nanu jnYaapakamuMchukonumu5. dhaevaa needhu svaroopa - dhivyadharshanamunudhinadhinamu naakosagi - nanu jnYaapakamuMchukonumu6. mee maDhyana naa aathma - unnadhi bhayapadakudanina mahoannathudaa - nanu jnYaapakamuMchukonumu7. mudhamaara nannennukoni - mudhra yuMgaramuganuchaethunanina prabhuvaa - nanu jnYaapakamuMchukonumu8. krupaa sathya sammilitha - nMpoorNa svaroophallelooya neekae prabhoa - ellappudu kalugunugaak