• waytochurch.com logo
Song # 374

dhevudu maapakshamuna vundaga దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు


దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
జీవగల దేవుని సైన్యముగా - సాతాను నోడింతుము -2
యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు

1. మా దేవుని బాహువే - తన దక్షిణ హస్తమే
ఆయన ముఖ కాంతియే - మాకు జయమిచ్చును -2
తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృప చూపించి
తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనపరుచును

యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు

2. మా దేవుని ఎరిగిన - జనులముగా మేమందరం
బలముతొ ఘనకార్యముల్ - చేసి చూపింతుము -2
దేవునిచే సూర క్రియలను చేసి - భూమిని తలక్రిందులుగా చేసి
ఆయన నామము పైకెత్తి - ప్రభు ధ్వజము స్థాపింతుము

యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే
విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే -2
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు
మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com