• waytochurch.com logo
Song # 3741

unnatha gruhamunu thvaragaa chaeri smpannuni dharshimthunuఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతును



Reference: యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. యెషయా Isaiah 35:9

1. ఉన్నత గృహమును త్వరగా చేరి
సంపన్నుని దర్శింతును - ఈ
పేదగు నా కోర్కె సఫలము చేసిన
నాథుని కొనియాడుదున్

2. దూతల మధ్యను స్తోత్రము లొందెడు
ప్రభుని స్తోత్రింతును - సు
గంధము వీచెడి పుష్ప రాజంబుల
మధ్యను నిద్రింతున్

3. ఆకాశ గణములు సేవించుచుండగ
వీకతో వారిజేరుదున్ - నా
యేసుని స్తుతుల నోరార పాడి
భాసురముగ నుతింతున్

4. స్ఫటిక నది తీరమున నేను
పాడుచు తిరుగుదును - ఆ
బంగారు వీధిలో యేసుతో నేను
రంగుగ నడుగిడుదున్

5. పలువిధ మృగములు పైబడినను
నెవ్విధమున భయపడను - ఆ
వెంగియు సింహము నాపై వచ్చిన
నగవుతో రమ్మనెదన్

6. పక్షులు అయ్యెడ ననేకముండును
వృక్షఫలములుండున్ - నా
రక్షకుడగు యేసు నాకై చేర్చిన
అక్షయ ధనముండున్

7. పేతురు యోహాను పౌలుతో నేనును
ప్రీతితో వసియింతును - నా
చల్లని మిత్రుని ఇంటను హర్షముతో
హల్లెలూయ పాడెదను



Reference: yehoavaa vimoachiMchinavaaru paatalupaaduchu thirigi seeyoanunaku vachchedharu. yeShyaa Isaiah 35:9

1. unnatha gruhamunu thvaragaa chaeri
sMpannuni dharshiMthunu - ee
paedhagu naa koarke saphalamu chaesin
naaThuni koniyaadudhun

2. dhoothala maDhyanu sthoathramu loMdhedu
prabhuni sthoathriMthunu - su
gMDhamu veechedi puShpa raajMbul
maDhyanu nidhriMthun

3. aakaasha gaNamulu saeviMchuchuMdag
veekathoa vaarijaerudhun - naa
yaesuni sthuthula noaraara paadi
bhaasuramuga nuthiMthun

4. sphatika nadhi theeramuna naenu
paaduchu thirugudhunu - aa
bMgaaru veeDhiloa yaesuthoa naenu
rMguga nadugidudhun

5. paluviDha mrugamulu paibadinanu
nevviDhamuna bhayapadanu - aa
veMgiyu siMhamu naapai vachchin
nagavuthoa rammanedhan

6. pakShulu ayyeda nanaekamuMdunu
vrukShphalamuluMdun - naa
rakShkudagu yaesu naakai chaerchin
akShya DhanamuMdun

7. paethuru yoahaanu pauluthoa naenunu
preethithoa vasiyiMthunu - naa
challani mithruni iMtanu harShmuthoa
hallelooya paadedhanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com