idhigo vinuma lokama ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో ప్రభువు రానుండెను
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను -2సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా... అ ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను.. ఊ ఉ ఉ 1. మహా మహా ఆర్భాటముతో - ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో - ప్రభువు వేగమే దిగి వచ్చును - 2 ప్రభు నందు మృతులు లేతురు - సమాధులు తెరువగా విస్వాసులంతా దాల్తురు - మహిమ రూపును వింతగా ఎత్తబడును సంఘము - అయ్యో ! విడువబడుట ఘోరము ... సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను2. ఏడేండ్లు భువిపై శ్రమ కాలం - ప్రాణాలు జారే భయ కాలం బూరలు తెగుళ్ళు - దైవ ఉగ్రతా పాత్రలు -2 ఆకాశ శక్తుల్ కదులును -గతి తప్పును ప్రకృతి కల్లోలమౌను లోకము - రాజ్య మేలును వికృతి సంఘమెంతో హాయి రా - మధ్యాకాశాన విందు రాసిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను3. అన్యాయం చేయువాడు చేయునిమ్ము - అపవిత్రుడట్లే యుండనిమ్ము పరిశుద్ధుడింకను - పరిశుద్దుని గుండనిమ్ము -2 ప్రతివాని క్రియల జీతము - ప్రభు తెచ్చును ఒక దినం రహస్య క్రియలు అన్నియు - బయల్పడునులే ఆ దినం లోక ధనము కూడిరా - నీకుంద పై సంపదా సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను4. ఒలీవ కొండపై రారాజు - అడుగు పెట్టెడి ఆ రోజు కొండయే చీలును - భూగోళమే కంపించును - 2 ప్రతి జనము ప్రభుని చూచును - ప్రతి జాతీయు మ్రొక్కును నిజమైన ప్రభువు యేసని - ప్రతి నాలుక ఒప్పును ప్రభుని రెండవ రాకడా - సాతానుకు దడ దడసిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను5. వెయ్యేండ్లు భువి పై ప్రభు యేసు - పాలించును పరిపాలించును నీతి సమాధానం - ఆత్మ యందలి ఆనందం -2 ఈ భూమి దాని కృత్యముల్ - సమస్తము కాలిపోవున్ మిక్కటమైన వేడితో - పంచభూతముల్ లయమగున్ కొత్త భూమి ఆకాశం - ఇంక శాశ్వత జీవితంసిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను6. క్రీస్తేసును విస్వసించువారే -పరిశుద్ధులుగ తీర్చబడ్డవారే దేవుని మహిమకు - నిత్య జీవమునకు అర్హులు -2 జీవం మరణం రెండును - నీ ఎదుటనే యున్నవి ప్రభు యేసే జీవామార్గమని - నీకు తెలుపబడి యున్నది విశ్వసించు ప్రియుడా - కాదు తక్కెడోపిక్కడాసిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను - 2 సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా -2 మరనాతా...... అ